బ్రిటిష్ కాలం నాటి రైల్వే మటన్ కర్రీ.. రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు...

First Published | Jun 5, 2021, 2:22 PM IST

రైల్వే మటన్ కర్రీ... తక్కువ మసాలాతో చేసే మటన్ కర్రీ.. స్వతంత్రం రాకముందు పశ్చిమ రైల్వే ల్లో ఈ మటన్ స్పెషల్ ఎక్కువగా ఉండేదట. ఇది ఫ్రాంటియర్ మెయిల్ ఫస్ట్-క్లాస్ బోగీలో మొదటిసారిగా సర్వ్ చేయబడింది. 

రైల్వే మటన్ కర్రీ... తక్కువ మసాలాతో చేసే మటన్ కర్రీ.. స్వతంత్రం రాకముందు పశ్చిమ రైల్వే ల్లో ఈ మటన్ స్పెషల్ ఎక్కువగా ఉండేదట. ఇది ఫ్రాంటియర్ మెయిల్ ఫస్ట్-క్లాస్ బోగీలో మొదటిసారిగా సర్వ్ చేయబడింది.ఆ తరువాత అనేక రైల్వే క్యాంటీన్లు, ఫస్ట్ క్లాస్ కోచ్లు, సెలూన్లు, దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే ఆఫీసర్ క్లబ్ లలో భాగంగా మారింది. అసలు దీనికి ఈ పేరు ఎందుకు వచ్చింది, ఎలా ఇది రైల్వే మీల్స్ లో భాగం అయ్యింది అనడానికి ఓ ఆసక్తికరమైన కథనం ఉంది.
ఫ్రాంటియర్ మెయిల్ (గోల్డెన్ టెంపుల్ మెయిల్) చెఫ్ తన కోసం వంట చేసుకుంటున్నప్పుడు ఓ బ్రిటిష్ అధికారి అనుకోకుండా తాగినమత్తులో వంటగదిలోకి వచ్చాడట. అక్కడ అతను ఆ వంటకం సువాననకు అదిరిపడి దాన్ని రుచి చూశాడట. అంతే గిన్నెమొత్తం ఒక్కడే ఖాళీ చేశాడట.కాకపోతే కారం ఎక్కువగా ఉందని కాస్త తగ్గించి ఈ కూరను కూడా రైల్వే మెనూలో చేర్చమని చెప్పాడు. అలా ఈ మటన్ కర్రీ రైల్వే మటన్ కర్రీ గా ప్రాచుర్యంలోకి వచ్చింది.

దీని అద్భుతమైన రుచితో రైల్వే మెనూలోనే కాకుండా, ప్రయాణికుల హృదయాల్లోనూ ఇది చోటు సంపాదించుకుంది. ఆ తరువాతి కాలంలో అనేక రూపాంతరాలు చెంది.. ఇప్పుడు మరింత కారంగా కూడా మారింది. ఇప్పుడు రైల్వే మెనూలో ఇది లేకపోయినప్పటికీ... ఇప్పటికీ కొన్ని రైల్వే క్యాంటీన్లు, ఆఫీసర్స్ క్లబ్స్ లో ఇది దొరుకుతుంది. జమాల్పూర్ రైల్వే ఆఫీసర్ కాలనీలో కూడా కొన్ని ప్రత్యేక సందర్భాలలో దీన్ని తయారు చేస్తారు.
రైల్వే మటన్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు1 కిలో మటన్2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్2 తరిగిన టమోటాలు2 టీస్పూన్ల ఆకుపచ్చ ఏలకులు3 లవంగాలు అవసరాన్ని బట్టి2 టీస్పూన్ల పసుపు1 టీస్పూన్ కారంపొడి1 టీస్పూన్ జీలకర్ర12 కప్పు నెయ్యి1 పచ్చిమిర్చి3 మీడియం బంగాళాదుంపలు250 గ్రాముల ఉల్లిపాయ2 టేబుల్ స్పూన్ల అల్లం పేస్ట్1 అంగుళాల దాల్చినచెక్క1 నల్ల ఏలకులు2 బిర్యానీ ఆకులు3 టీస్పూన్ల కొత్తిమీర పొడి1 టీస్పూన్ నల్ల మిరియాలురుచికి తగినంత ఉప్పు12 కప్పు ఆవాల నూనె1 టీస్పూన్ గరం మసాలా పొడి
రైల్వే మటన్ కర్రీని తయారు చేసేవిధానంముందుగా ఓ పెద్ద కడాయి తీసుకుని స్టౌమీద పెట్టుకోవాలి.. ఇది వేడెక్కాక ఇందులో ఆవనూనె, నెయ్యి వేసి వేడిచేయాలి. ఆ తరువాత దీంట్లో దాల్చినచెక్క, ఏలకులు, బిర్యానీ ఆకులు, లవంగాలు వేసి 2 నిమిషాలు వేయించాలి. ఆ తరువాత ఉల్లిపాయ, ఉప్పు, పసుపు వేసి లేత గోధుమరంగు వచ్చేవరకు పెద్ద మంట మీద వేయించాలి.
ఇప్పుడు ముందుగా శుభ్రంగా కడిగిపెట్టుకున్న మటన్ ను వేసి బాగా కలపాలి. ఆ తరువాత స్టౌ మంట తగ్గించి మూతపెట్టి 10-12 నిమిషాలు ఉడికించాలి. తర్వాత టమోటాలు, బంగాళాదుంప, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి బాగాకలపండి. పచ్చిమిర్చి అసలు వంటకంలో లేదు. మీ ఇష్టానికి అనుగుణంగా చేర్చుకోవచ్చు.కలిపినాక మళ్లీ మూత పెట్టి తక్కువ మంట మీద మరో 15 నిమిషాలు ఉడికించాలి.కూర అడుగంటకుండా ప్రతీ 5 నిమిషాలకోసారి కలుపుతుండాలి. మటన్, ఉల్లిపాయ, టమోటాలనుంచి ఊరే నీటితోనే మాంసం ఉడకడం వల్ల మంచి రుచి వస్తుంది.
ఇప్పుడు మిగిలిన పొడి మసాలా దినుసులు వేసి బాగా కలపాలి. దీన్లో చిటికెడు చక్కెర వేయండి. ఇది మాంసానికి చక్కని రంగును ఇస్తుంది. ఇక ఇప్పటికే కూర సగానికి పైగా ఉడికి ఉంటుంది. ఈ సమయంలో నీళ్లు తక్కువైనట్టు అనిపిస్తే ఒక కప్పు నీళ్లు పోసి బాగా కలిపి, తక్కువ మంట మీద మరో 15 నిమిషాలు ఉడికించాలి.
మటన్ మరీ మెత్తగా అయి చితికిపోకుండా ఉండాలంటే మధ్యమధ్యలో కలుపుతూ చెక్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మంట పెంచి కూరనుంచి నూనె వేరుగా కనిపించేవరకు ఉడికించాలి. ఆ తరువాత గరం మసాలా పొడి, 3 కప్పుల నీళ్లు పోసి, 5- నిమిషాలపాటు ఎక్కువ మంట మీద ఉడికించాలి.
అంతే రైల్వే మటన్ కర్రీ సిద్ధం అయినట్టే దీన్ని అన్నం, చపాతీలతో తింటే బాగుంటుంది.
చిట్కాలు..వాస్తవానికి బ్రిటీష్ కాలంలో రైల్వే మటన్ కర్రీలో మసాలాలు తక్కువగా ఉండేవి. కానీ కాలక్రమేణా ఇది భారతీయుల రుచికి తగినట్టుగా మారిపోయింది.తక్కువ కారం కావాలంటే పచ్చిమిర్చి, కారంపొడి క్వాంటిటీలు తగ్గించవచ్చు.మటన్ ఉడకదు అనిపిస్తే రెండు విజిల్స్ ముందుగా ఉడికించొచ్చు.కూర మొత్తం అయ్యాక చివర్లో ఒక చెంచా నెయ్యిని వేస్తే కూర రుచి మరింత పెరుగుతుంది.

Latest Videos

click me!