క్వినోవా ఉప్మా... హెల్తీ అండ్ టెస్టీ...

First Published May 19, 2021, 5:15 PM IST

రోజూ అవే టిఫిన్స్ తినీ తినీ బోర్ కొట్టిందా.. అయితే ఇది మీ కోసమే.. హెల్తీ అండ్ టెస్టీ క్వినోవా ఉప్మా. రకరకాల కూరగాయలు, క్వినోవాతో తయారయ్యే ఈ ఉప్మా మీ కడుపునింపడమే కాదు మిమ్మల్ని ఎక్కువ క్యాలరీలు లేకుండా.. చక్కగా ఆరోగ్యంగా ఉంచుతుంది.

రోజూ అవే టిఫిన్స్ తినీ తినీ బోర్ కొట్టిందా.. అయితే ఇది మీ కోసమే.. హెల్తీ అండ్ టెస్టీ క్వినోవా ఉప్మా. రకరకాల కూరగాయలు, క్వినోవాతో తయారయ్యే ఈ ఉప్మా మీ కడుపునింపడమే కాదు మిమ్మల్ని ఎక్కువ క్యాలరీలు లేకుండా.. చక్కగా ఆరోగ్యంగా ఉంచుతుంది.
undefined
క్వినోవా ఉప్మా తయారీకి కావాల్సిన పదార్థాలు...1 కప్పు క్వినోవా2 టేబుల్ స్పూన్ల వెజిటబుల్ ఆయిల్1 ఎండు మిర్చి2 కరివేపాకు రెబ్బలు12 టీస్పూన్ జీలకర్ర1 టీస్పూన్ పెసరపప్పు13 కప్పు ఎండు బఠానీలు2 కప్పుల నీరు14 కప్పు తరిగిన గ్రీన్ బీన్స్1 పెద్ద తరిగిన ఉల్లిపాయ1 టీస్పూన్ తరిగిన అల్లం
undefined
14 టీస్పూన్ ఇంగువ1 టీస్పూన్ ఆవాలు1 టీస్పూన్ మినపపప్పు12 కప్పు క్యారెట్ తురుమురుచికి తగినంత ఉప్పు1 పచ్చిమిర్చి సన్నగా తరగాలి
undefined
క్వినోవా ఉప్మా తయారు చేసే విధానం..ముందుగా క్వినోవాను ఒక జాలిలో వేసి నళ్లాకింద పెట్టి బాగా కడిగి.. పక్కన పెట్టుకోవాలి.
undefined
ఇప్పుడు ఒక బాణలిలో నూనె వేడి చేయాలి. దీంట్లో జీలకర్ర, ఆవాలు వేసి కాసేపు చిటపటలాడనివ్వాలి. ఆ తరువాత ఇంగువా, పెసరపప్పు, మినపపప్పు వేసి వేయించాలి. దీనికి తరిగిన అల్లం, ఎండుమిర్చి వేసి వేగనివ్వండి.
undefined
ఈ మిశ్రమానికి ఇప్పుడు ఉల్లిపాయలు, కరివేపాకు చేర్చి కాసేపు తక్కువ మంట మీద వేగించండి. ఆ తరువాత క్యారెట్లు, క్యాప్సికమ్, బఠానీలు, గ్రీన్ బీన్స్ జోడించండి. దీనికి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి.
undefined
ఇప్పుడు క్వినోవా వేసి, బాగా కలపండి. ఆ తరువాత 2 నిమిషాల పాటు వేయించి.. తతరువాత నీరు వేసి బాగా కలపాలి. దీనికి మూతపెట్టి కొద్ది నిమిషాల పాటు సన్న మంట మీద ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతూ క్వినోవా ఉడికేదాకా అలాగే ఉంచాలి.
undefined
అంతే.. హెల్తీ క్వినోవా ఉప్మా రెడీ. దీన్ని వేడివేడిగా కొబ్బరి పచ్చడి లేదా ఏదైనా ఊరగాయతో తింటే చాలా బాగుంటుంది.
undefined
click me!