ఇప్పుడున్న పరిస్థితుల్లో మనిషికి ఆరోగ్యాన్ని మించిన పెద్ద సంపద ఏదీ లేదనే చెప్పాలి. ఎటుచూసినా.. ఏదో ఒక కొత్త రకం వైరస్లు ఎటాక్ చేస్తూనే ఉన్నాయి. చేతిలో రూ.కోట్లు ఉన్నా.. కొన్నిరకాల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడలేక ప్రాణాలు కోల్పోతున్నారు. కేవలం ఆరోగ్యవంతులు మాత్రమే బతికి బయటపడుతున్నారు. అందుకే ఈ రోజుల్లో అందరూ కేవలం ఆరోగ్యం కోసం పరుగులు పెడుతున్నారు.
ఈ ఆరోగ్యపు వేటలో అందరూ ప్రతిరోజూ ఒక గ్లాస్ పాలు తాగడం మొదలుపెట్టారు. పాలు తాగడం వల్ల శరీరానికి కావాల్సిన కాల్షియం అందుతుంది. ఇది చాలా మంచి విషయమే. అయితే.. అదే పాలల్లో కొద్దిగా నెయ్యి కలుపుకొని తాగితే..మరింత ఎక్కువ ఆరోగ్యం లభిస్తుందట. అంతేకాదు శృంగారంలో వెనకపడిన వారికైతే ఇది వయగ్రాలా పనిచేస్తుందట. దీని వల్ల కలిగే మరిన్ని లాభాలను ఇప్పుడు చూద్దాం..
పాలల్లో నెయ్యి కలుపుకొని తాగడం వల్ల మెటాబాలిజం, స్టామినా పెరుగుతుందట. జాయిట్ పెయిన్స్ కూడా తగ్గుతాయి. ఆయుర్వేదం ప్రకారం.. నెయ్యిని తీసుకోవడం చాలా ప్రయోజనాలు ఉన్నాయని మన పూర్వీకులు కూడా చెప్పారు.
గ్లాసు పాలలో రాత్రి పూట పడుకోవడానికి ముందు ఒక స్పూన్ నెయ్యి కలుపుకొని.. తాగడం వల్ల శరీరంలోని స్టామినా పెరుగుతుందట.
పాలు, నెయ్యి.. రెండింట్లో నేచురల్ మాయిశ్చరైజర్లు ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల స్కిన్ చాలా మృదువుగా మారుతుంది. డల్ నెస్ తగ్గిపోయి.. యవ్వనంగా కనిపిస్తారు.
చాలా మంది నోట్లో పొక్కులు వచ్చి ఇబ్బంది పడుతుంటారు. అదేనండి మౌత్ అల్సర్లు. ఇవి తగ్గించడానికి కూడా ఈ పాలు, నెయ్యి అద్భుతంగా పనిచేస్తుంది. రాత్రి పడుకునేముందు నెయ్యి కలిపిన పాలు తాగితే మౌత్ అల్సర్లు తగ్గుతాయట.
సెక్సువల్ స్టామినా పెంచడానికి... వీర్యం నాణ్యత.. సంఖ్య పెరగడానికి ఇది వయాగ్రాలా పనిచేస్తుందట. ప్రతిరోజూ వేడి పాలల్లో రాత్రి పడుకునే ముందు నెయ్యి కలుపుకొని తాగాలట. అలా రోజూ తాగడం వల్ల సెక్స్ వల్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేయగలుగుతారట.
అరుగుదల సమస్యలతో బాధపడేవారికి కూడా ఇది దివ్యౌషధంలా పనిచేస్తుందట. డైజెస్టివ్ సిస్టమ్ మెరుగుపుడుతుంది.
జాయింట్ పెయిన్స్ తో బాధపడేవారు కూడా దీనిని ప్రతిరోజూ తీసుకోవచ్చట. అలా చేయడం వల్ల వారి ఎముకలు బలంగా మారి.. నొప్పులు తగ్గుముఖం పడతాయట.
ఈ మధ్యకాలంలో చాలా మంది ఒత్తిడి కారణంగా సరైన నిద్ర కూడా పోవడం లేదు. అలాంటి వారు దీనిని తాగడం వల్ల ప్రశాంతంగా నిద్రపోగలుగుతారట.
గర్భిణీ స్త్రీలు కూడా వీటిని తీసుకోవడం వల్ల.. వారితోపాటు.. కడుపులోని బిడ్డ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందట.