షుగర్ పెషేంట్స్.. ఈ పండు తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | May 19, 2021, 3:08 PM IST

ఈ పండ్లు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతంది. రక్తంలోని షుగర్ లెవల్స్ తగ్గుతాయి. దీనిలో ప్రోటీన్స్, విటమిన్ ఏ, సీ, పొటాషియం, యాంటీ యాక్సిడెంట్స్, ఫైబర్ లాంటివి చాలా ఉన్నాయి.

షుగర్ వ్యాధితో బాధపడేవారు.. అన్ని పండ్లు తినకూడదు. ఏది తింటే.. ఏమౌతుందా అని భయపడుతుంటారు. అలాంటివారు కచ్చితంగా తినాల్సిన పండ్లలో పనస ఒకటి. ఈ పనస పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.
ఈ పండ్లు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతంది. రక్తంలోని షుగర్ లెవల్స్ తగ్గుతాయి. దీనిలో ప్రోటీన్స్, విటమిన్ ఏ, సీ, పొటాషియం, యాంటీ యాక్సిడెంట్స్, ఫైబర్ లాంటివి చాలా ఉన్నాయి.

చికాగోలోని అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఈ పండును రెగ్యులర్ గా తినడం వల్ల టైప్ డయాబెటిక్స్ తగ్గుముఖం పట్టే అవకాశం ఉందట.
ఉదయాన్నే అన్నం, ఇడ్లా, దోశ, చపాతీ లాంటివి తినే బదులు.. దాని ప్లేస్ లో పనస పండు తినాలట. దీని వల్ల కార్బొహైడ్రేట్స్ తగ్గుతాయి. బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి.
షుగర్ పేషెంట్స్.. ఆస్పత్రికి వెళితే.. వారికి రక్తంలోని షుగర్ లెవల్స్ తగ్గడానికి మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు. అయితే.. ఆ పని ఈ పనస పండు ఒక్కటే చేయగలదట.
కేవలం షుగర్ పేషెంట్స్ మాత్రమే కాదు.. ఒబేసిటీతో బాధపడుతున్నవారికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందట. సులభంగా బరువు తగ్గేందుకు సహాయం చేస్తుందట.

Latest Videos

click me!