మిగిలిపోయిన అన్నంతో దోశ, పకోడీ చేయవచ్చు తెలుసా?

First Published | May 28, 2024, 12:34 PM IST

 మిగిలిపోయిన అన్నంతో రుచికరమైన దోశ చేసుకోవచ్చు అని మీకు తెలుసా?  వేడి వేడి పకోడీలు కూడా వేసుకోవచ్చు. 

Cooked rice

రాత్రి వండిన అన్నం మిగిలింది అనుకోండి... ఏం చేస్తారు..? మన భారతీయ ఇళ్లల్లో ఎక్కువ మంది.. పులిహోర,  పోపు అన్నం, మహా అంటే ఎగ్ రైస్ లాంటి రైస్ ఐటెమ్స్  చేసుకుంటూ ఉంటారు. కానీ, మిగిలిపోయిన అన్నంతో రుచికరమైన దోశ చేసుకోవచ్చు అని మీకు తెలుసా?  వేడి వేడి పకోడీలు కూడా వేసుకోవచ్చు.  కేవలం దోశ , పకోడీలు మాత్రమే కాదు... అన్నంతో చాలా రకాల బ్రేక్ ఫాస్ట్ లు తినేయవచ్చు. అవి ఎలా చేసుకోవచ్చో ఓసారి చూద్దాం...


1. మిగిలిపోయిన అన్నంతో  వేడి, వేడి పకోడీ ఎలా చేయాలో చూద్దాం...

అన్నంతో తయారు చేసే ఈ పకోడీలు.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి మాత్రమే కాదు.. సాయంత్రం పూట  టీ తాగుతూ, స్నాక్స్  గా కూడా తీసుకోవచ్చు. 

కావాల్సిన పదార్థాలు..
1.3కప్పుల ఉడకపెట్టిన అన్నం, 2 టేబుల్ స్పూన్ల శెనగ పిండి, 1ఉల్లిపాయ , రెండు పచ్చి మిరపకాయలు, కొత్తిమీర తరుగు, రుచికి తగినంత ఉప్పు.


తయారీ విధానం..

అన్నాన్ని మెత్తగా చేతితో స్మాష్ చేయాలి. ఇప్పుడు  దీనిలో... పైన చెప్పిన శెనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిరపకాయలు ముక్కలు, ఉప్పు, కొత్తమీర తరుగు అన్ని వేసి  కలుపుకోవాలి. ఇప్పుడు.. స్టవ్ మీద కడాయి పెట్టి.. దాంట్లో నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత.. కలుపుకున్న పిండిని.. పకోడీల్లా వేసుకోవడమే. రుచి బాగుంటాయి. చక్కగా కరకరలాడుతూ.. పిల్లలకు ,పెద్దలకు కచ్చితంగా నచ్చుతాయి.

2.మిగిలిపోయిన అన్నంతో దోశలు,..
మన దగ్గర దోశ లవర్స్ చాలా మందే ఉంటారు. కానీ.. దాని ప్రాసెస్ మాత్రం చాలా పెద్దది. ముందు రోజే పప్పులు కనీసం  ఐదు , ఆరు గంటలు నానపెట్టి తర్వాత బ్లెండ్ చేసుకోవాలి. కానీ... ఈ అన్నంతో చేసే దోశలు మాత్రం.. అప్పటికప్పుడు ఇన్ స్టాంట్ గా చేసుకోవచ్చు.
దాని కోసం.. 2 నుంచి 3 కప్పుల అన్నం, ఒక కప్పు పెరుగు, కొంచెం ఉప్పు, కొద్దిగా నూనె, ముక్కలుగా కోసుకున్న రెండు ఉల్లిపయాలు ఉంటే సరిపోతుంది.
 

ముందుగా అన్నం, పెరుగు, ఉల్లిపాయ అన్నీ మిక్సీ జార్ లో వేసుకొని మెత్తటి  పేస్టులాగా చేసుకోవాలి. ఇప్పుడు.. దీనిలో ఉప్పు వేసి బాగా కలపాలి. కాసేపు పక్కన పెట్టిన తర్వాత.. వేడి వేడి పెనం మీద దోశలు వేసుకుంటే సరిపోతుంది. చాలా రుచిగా ఉంటాయి. ఉల్లిపాయను పేస్టులా కలపడం ఇష్టం లేకపోతే.. ముక్కలుగా కూడా వేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా.. ఉంటాయి. దోశను ఎర్రగా కాలే వరకు ఉంచుకుంటే.. రుచి అద్భుతంగా ఉంటుంది.

Latest Videos

click me!