మనలో చాలా మందికి టేబుల్ సాల్ట్ , బ్లాక్ సాల్ట్ అనే ఒకటి లేదా రెండు రకాల ఉప్పు గురించి మాత్రమే తెలుసు. కానీ, ఉప్పులో చాలా రకాలు ఉన్నాయి . వాటన్నింటికీ వేర్వేరు ఉపయోగాలు ఉన్నాయి. మీరు బిర్యానీ డిష్‌లో పావ్ భాజీ మసాలా వేయనట్లే, ఇక్కడ కూడా అదే సూత్రం వర్తిస్తుంది. సముద్రపు ఉప్పు, హిమాలయన్ గులాబీ ఉప్పు, సెల్టిక్ సముద్రపు ఉప్పు, ఫ్లూర్ డి సెల్, ఫ్లేక్ సాల్ట్, బ్లాక్ హవాయి ఉప్పు మొదలైన అనేక రకాల్లో, వాటి వినియోగం దాని స్ఫటికాల పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. దేనికి ఏ ఉప్పు వాడాలో తెలుసుకొని వాడాలి.