రాత్రిపూట అస్సలు తినకూడని కూరగాయలు ఇవే..!

First Published | May 27, 2024, 4:45 PM IST

ఉదయం పూట తిన్నప్పుడు మనకు ఎంతో ఆరోగ్యాన్ని అందించినా.. రాత్రిపూట తినడం వల్ల అంత ప్రమాదాన్ని, అన్ని ఆరోగ్య సమస్యలను సృష్టిస్తాయట. మరి.. మనం రాత్రిపూట మాత్రం దూరంగా ఉండాల్సిన ఆహారాలేంటో ఓసారి చూద్దాం...
 

ఆరోగ్యంగా ఉండాలంటే.. మన భోజనం సమతుల్యంగా ఉండాలి. అంటే.. అందులో పండ్లు, పప్పుులు ధాన్యాలతో పాటు.. కూరగాయలు కూడా అంతే ముఖ్యం. కూరగాయలు తీసుకుంటే మనం చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎందుకంటే.. వాటిలో అనేక రకాల పోషకాలు ఉంటాయి.. అవి మనల్ని మరింత ఆరోగ్యంగా ఉంచుతాయి. చాలా రకాల ఆరోగ్య సమస్యల నుంచి కాపాడతాయి. ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ కూరగాయల్లో కొన్నింటిని మాత్రం.. రాత్రిపూట మాత్రం తినకూడదట.

ఉదయం పూట తిన్నప్పుడు మనకు ఎంతో ఆరోగ్యాన్ని అందించినా.. రాత్రిపూట తినడం వల్ల అంత ప్రమాదాన్ని, అన్ని ఆరోగ్య సమస్యలను సృష్టిస్తాయట. మరి.. మనం రాత్రిపూట మాత్రం దూరంగా ఉండాల్సిన ఆహారాలేంటో ఓసారి చూద్దాం...

Latest Videos



1.వెల్లుల్లి: రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవాలంటే వెల్లుల్లి తినకూడదు. లేదంటే పొట్టలో గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. 

బ్రోకలీ: ఇందులో ఉండే ట్రిప్టోఫాన్ నిద్రను ప్రేరేపిస్తుంది. అలాగే ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాత్రి భోజనంలో తీసుకుంటే జీర్ణం కావడం కష్టమవుతుంది.


ఉల్లిపాయ: ఆరోగ్యానికి మంచిదని భావించినప్పటికీ, రాత్రిపూట ఎక్కువగా తీసుకుంటే, నిద్రలేమికి కారణం అవుతుంది. అది కాకుండా, 
కడుపులో యాసిడ్ సమస్య కూడా వస్తుంది.


టొమాటో: రాత్రిపూట దీన్ని ఎక్కువగా తీసుకోకండి. అది దాటితే పొట్ట సంబంధిత సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఇందులో ఆమ్ల గుణాలు ఉంటాయి. ఇది మెదడు కార్యకలాపాలను పెంచుతుంది. దీనివల్ల నిద్రపట్టడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.

చిలగడదుంప: ఇందులో కార్బోహైడ్రేట్లు , పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. రాత్రిపూట తీసుకుంటే కడుపు ఉబ్బరం , గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.
 


పచ్చి బఠానీలు: వివిధ రకాల పోషకాలను కలిగి ఉంటుంది.  ఇది ఆరోగ్యానికి చాలా మంచిదే అయినప్పటికీ, రాత్రిపూట తింటే, కడుపు ఉబ్బరం , గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. అంతే కాకుండా, ఇది జీర్ణవ్యవస్థపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. వీటికి రాత్రి పూట మాత్రం దూరంగా ఉండండి. 

click me!