టేస్టీ టేస్టీ జిలేబీ, మసాలా వడా, అప్పం, దహీ పూరీలు చెత్త ఫుడ్సా..

First Published | Jul 25, 2024, 1:13 PM IST

ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ ఒక్క ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయ్యాయి. వీటిని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. కానీ మనం ఇష్టంగా తినే కొన్ని ఆహారాలు మాత్రం ఫుడ్స్.. చెత్త ఫుడ్స్ లీస్ట్ లో ఉన్నాయంటే ఎవరైనా నమ్ముతారా? అసలు చెత్త భారతీయ స్ట్రీట్ ఫుడ్స్ ఏంటో ఓ లుక్కేద్దాం పదండి.  
 

జిలేబీ

ఇండియాలో చాలా ప్లేసుల్లో వేడి వేడి జిలేబీ మనకు కనిపిస్తూనే ఉంటుంది. తీయగా ఉండే జిలేబీని ఇష్టంగా తినేవారు చాలా ఎక్కువే. ఇరాన్, భారతదేశాల్లో జిలేబీని ఎక్కువగా తింటారు. ముఖ్యంగా స్పెషల్ అకేషన్ లో జిలేబీని ఖచ్చితంగా వడ్డిస్తారు. చాలా మందికి నచ్చే ఈ జిలేబీకి చెత్త రేటింగ్ వచ్చింది తెలుసా? 
 

Sev

సెవ్

సెవ్ అనేది చిక్‌పా పిండితో తయారుచేస్తారు. ఇది ఎంతో క్రిస్పీగా, టేస్టీగా ఉంటుంది. అందుకే దీన్ని సాక్స్ గా చాలా మంది తింటారు. మీకు తెలుసా? ఇది రకరకాల ఇండియన్ స్ట్రీట్ ఫుడ్స్, చాట్‌లకు క్రంచీ టాపింగ్‌గా కూడా ఉపయోగిస్తారు. 


Dabeli

దాబేలి

దాబేలి కూడా మంచి స్ట్రీట్ ఫుడ్. దాబేలి అనేది దానిమ్మ గింజలు, వేరుశెనగలు, సెవ్‌  కూడిన మసాలా బంగాళాదుంపల మిశ్రమం. దీన్ని వెన్నతో కాల్చిన బన్ లో నింపుతారు. ఈ వంటకం గుజరాత్ లో పుట్టింది. ఇది కూడా అందరికీ బాగా నచ్చే టేస్టీ స్ట్రీట్ ఫుడ్ స్నాక్. 

Dahi puri

దహీ పూరి

దహీ పూరిని కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. దీన్ని పెరుగు, చట్నీ, బంగాళదుంపలు, రకరకాల మసాలా దినుసులతో తయారుచేస్తారు. ఈ దహీ పూరీలు ఎంతో క్రిస్పీగా పూరీలు ఉంటాయి. చిక్కగా, తీయగా, కారంగా ఉండే  ఈ చాట్ వంటకాన్ని చాలా మంది బాగా తింటారు. 
 

Bombay Sandwich

బాంబే శాండ్ విచ్

బాంబే శాండ్‌విచ్ నూ ప్రతి ఒక్కరూ టేస్ట్ చేసే ఉంటారు. దీన్ని రకరకాల కూరగాయలు, చట్నీ, మసాలాలను ఉపయోగించి తయారుచేస్తారు. ఇది మంచి రిఫ్రెష్ టేస్ట్ ను ఇస్తుంది. మీకు తెలుసా? ఈ వెజ్ శాండ్‌విచ్ ముంబైలో ఒక పాపులర్ స్ట్రీట్ ఫుడ్. 

Appam

అప్పం

అప్పాన్ని కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. కానీ దీనికి చెత్త రేటింగ్ వచ్చింది. ఈ అప్పాన్ని పులియబెట్టిన బియ్యపు పిండి, కొబ్బరి పాలతో తయారుచేస్తారు. ఇది దక్షిణ భారతీయ పాన్‌కేక్. ఇది ఎంతో మృదువుగా ఉంటుంది. అప్పాన్ని సాధారణంగా ఏదైనా వంటకం లేదా కూరతో వడ్డిస్తారు. 
 

ఎగ్ భూర్జీ

ఎగ్ భుర్జీ ని కూడా చాలా మంది తింటుంటారు. దీన్ని ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చి మిరపకాయలు, మసాలాలతో తయారుచేస్తారు. కోడిగుడ్లను గిలకొట్టి ఎగ్ భుర్జీని తయారుచేస్తారు. ఈ స్ట్రీట్ ఫుడ్ వాసన అదిరిపోతుంది. దీన్ని బ్రేక్ ఫాస్ట్ లో లేదా రోటీతో తింటారు. 
 

Masala Vada

మసాలా వడ

మసాలా వడ చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే చాలా మంది దీన్ని ఇష్టంగా తింటారు. అయితే ఈ మసాలా వడను సుగంధ ద్రవ్యాలు, ఉల్లిపాయలతో కలిపి, గ్రౌండ్ చనా పప్పుతో క్రిస్పీగా తయారుచేస్తారు. ఈ టేస్టీ స్నాక్స్ ను ఎక్కువగా టీ తో తీసుకుంటారు. 

Latest Videos

click me!