garlic
హెల్తీ ఫుడ్స్ ను తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటామన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలుసు. అయినా.. చెడు ఆహారాలను తింటే రోగాలు బారిన పడుతుంటారు చాలా మంది. నిజానికి మనం మంచివని తినే చాలా ఆహారాలు మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. ఇలాంటి వాటిలో టీ, కాఫీలు కూడా ఉన్నాయి. వీటిని పరిగడుపున తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కానీ ఉదయం లేచిన వెంటనే వీటినే తాగే వారు ఉన్నారు. మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఉదయం పరిగడుపున వీటిని తాగడానికి బదులుగా వెల్లుల్లి రెబ్బలను తినండి. వీటిలో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాలు, బయోయాక్టివ్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. అసలు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లిని తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఇన్ఫెక్షన్లకు దూరం
వెల్లుల్లిలో అల్లిసిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది వెల్లుల్లో ఘాటైన వాసనకు కారణమయ్యే సల్ఫ్యూరిక్ సమ్మేళనం. ఈ అల్లిసిన్ మన శరీరంలోని తెల్ల రక్త కణాల కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది. ఇవి ఇన్ఫెక్షన్లు, ప్రమాదకరమైన వ్యాధికారక క్రిములకు వ్యతిరేకంగా మన శరీరాన్ని రక్షించడానికి సహాయపడతాయి.
ఇమ్యూనిటీ పవర్
పొద్దున్నే పరిగడుపున వెల్లుల్లిని తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. రోగనిరోధక శక్తి ఎంత ఎక్కువగా ఉంటే.. మనకు వ్యాధులొచ్చే ప్రమాదం అంత తగ్గుతుంది. ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా.. తొందరగా తగ్గుతుంది. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారు పరిగడుపున వెల్లుల్లిని తింటే మంచి ప్రయోజనం ఉంటుంది.
Garlic
గుండె ఆరోగ్యం
వెల్లుల్లిని ప్రతిరోజూ తినడం వల్ల మన గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. వెల్లుల్లి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పచ్చి వెల్లుల్లి రక్తపోటు స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
మెరుగైన రక్తప్రసరణ
వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. ఇవి మన శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. అలాగే గుండెకు సంబంధించిన వ్యాధులు ప్రమాదాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తాయి.
జీర్ణవ్యవస్థ
ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తినడం వల్ల జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి. క్రమం తప్పకుండా పచ్చి వెల్లుల్లిని తింటే మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది గ్యాస్ట్రిక్ రసాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీంతో తిన్న ఆహారం సాఫీగా జీర్ణమవుతుంది. వెల్లుల్లిలో ఉండే ప్రీబయోటిక్ లక్షణాలు ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాను పెంచడానికి సహాయపడతాయి. అలాగే జీర్ణవ్యవస్థ మెరుగైన పోషకాల శోషణకు కూడా సహాయపడుతుంది. అలాగే జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.
కాలెయ ఆరోగ్యం
వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనం కాలేయం పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది రక్త ప్రవాహంలో ఉన్న హానికరమైన పదార్థాలను బయటకు పంపడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇది రెగ్యులర్ డిటాక్సిఫికేషన్ అవయవాలపై భారాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.
బ్లడ్ షుగర్
రక్తంలో చర్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా వెల్లుల్లి చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. మీ రక్తంలో చక్కెర్ స్థాయిలు హెచ్చుతగ్గులకు గురైతే మీరు రోజూ పరిగడుపున పచ్చి వెల్లుల్లి రెబ్బలను తినండి. వెల్లుల్లి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడానికి ఎంతో సహాయపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మీకు ప్రీడయాబెటిస్ లేదా టైప్ 2 డయాబెటిస్ ఉన్నట్టైతే ఇది బాగా ఉపయోగపడుతుంది.
అయితే మీ ఆహారపు అలవాట్లలో ఏదైనా ముఖ్యమైన మార్పులు చేసే ముందు డాక్టర్ ను ఖచ్చితంగా సంప్రదించండి.