వర్షాకాలంలో వామ్మె.. ఈ కూరగాయలు తింటున్నారా..?

First Published Jul 25, 2024, 9:59 AM IST

మీరు చదివింది నిజం.. వర్షాకాలంలో పొరపాటున కూడా కొన్ని కూరగాయలను అస్సలు తినకూడదట. ఏ కూరగాయలు తినకూడదో?  ఎందుకు తినకూడదో కూడా తెలుసుకుందాం..

వర్షాకాలం వచ్చేసింది. అడపాదడపా వర్షాలు పడుతూనే ఉన్నాయి. వాతావరణం చల్లగా మారడంతో మనకు కూడా హాయిగా అనిపిస్తోంది. మనకు ఈ కాలంలో తాజా కూరగాయలు దొరుకుతూ ఉంటాయి. అయితే.. తాజాగా ఉన్నాయి కదా అని... ఈ  కింది కూరగాయలు మాత్రం పొరపాటున కూడా తినకూడదు అని మీకు తెలుసా..? అవును.. మీరు చదివింది నిజం.. వర్షాకాలంలో పొరపాటున కూడా కొన్ని కూరగాయలను అస్సలు తినకూడదట. ఏ కూరగాయలు తినకూడదో?  ఎందుకు తినకూడదో కూడా తెలుసుకుందాం..

వర్షాకాలంలో ఎక్కువగా జీర్ణ సంబంధిత సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే డయేరియా, ఫుడ్ పాయిజన్ వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకే.. ఏం తిన్నా కాస్త చూసుకొని, జాగ్రత్తగా తినాలి. ఈ వర్షాకాలంలో చాలా కూరగాయల్లో పురుగులు, బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటాయి. వాటి కారణంగానే.. ఎక్కువగా సమస్యలు వస్తూ ఉంటాయి. మరి, ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే.. ఏ కూరగాయలు తినకూడదో చూద్దాం..

Latest Videos


1.ఆకుకూరలు..
నిజానికి వర్షాకాలంలో ఆకుకూరలు చాలా ఫ్రెష్ గా కనిపిస్తూ ఉంటాయి. చాలా బాగా పెరుగుతాయి కూడా. కానీ.. ఈ కాలంలోనే ఆకుకూరలు తినకూడదు అని నిపుణులు చెబుతున్నారు.  ఎందుకంటే... ఈ సీజన్ లో ఆకుకూరల్లో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. మన కంటికి కనిపించే పురుగులు మాత్రమే కాదు.. కంటికి కనిపించని బ్యాక్టీరియా కూడా ఉంటుంది. అందుకే.. వీటిని తినే సమయంలో చాలా  జాగ్రత్తగా ఉండాలి. అలా అని వీటిని పూర్తిగా తినకూడదు అని కాదు.. తినే సమయంలో.. వీటిని మంచిగా శుభ్రం చేసుకోవాలి. లేదంటే మాత్రం అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట.

2.క్యాబేజీ..
వర్షాకాలంలో క్యాబేజీ తినకుండా ఉండటమే మంచిది. ఈ సీజన్ లో క్యాబేజీ లో చాలా మాయిశ్చరైజేషన్ ఉంటుంది. దీనిని ప్రాపర్ గా స్టోర్ చేయకపోతే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయట. అందుకే.. క్యాబేజీని సరిగా స్టోర్ చేసుకోవాలి. వండే ముందు సరిగా వాష్ కూడా చేయాలి.

3.క్యాలీ ఫ్లవర్..
క్యాలీ ఫ్లవర్ కూడా..వర్షకాలంలో తినే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే...  ఈసీజన్ లో క్యాలిఫ్లవర్ తేమను ఎక్కువగా పీల్చుకుంటాయి.  దాని వల్ల.. పురుగులు దీనిలో  ఎక్కువగా నిల్వ ఉంటాయి. చూసుకోకుండా.. దీనిని తినేస్తే.. మీకు ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే కాస్త చూసుకొని, జాగ్రత్తగా తినాలి.
 

4.క్యాప్సికమ్..
క్యాప్సికమ్స్ లో.. నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే... ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అందుకే.. ఈ సీజన్ లో ఈ క్యాప్సికమ్  కి దూరంగా ఉండటమే మంచిది.
 

5.టమాటాలు..
సాధారణంగా అందరి ఇంట్లో కామన్ గా ఉండే కూరగాయ టమాట. చాలా మందికి టమాట లేదని వంటే పూర్తి కాదు. కానీ.. ఈ సీజన్ లో టమాటలను తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని నిపుణులు చెబుతున్నారు. ఈ సీజన్ లో టమాటలు తింటే.. జీర్ణ సమస్యలతో పాటు.. ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందట.

click me!