అన్నం తింటే బరువు తగ్గుతారా? అటుకులు తింటే తగ్గుతారా?

First Published Sep 20, 2024, 10:48 AM IST

బరువు తగ్గడానికి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు అన్నం పూర్తిగా మానేసి చపాతీలనే తింటుంటారు. కొంతమంది కేవలం ఒక్కపూట మాత్రమే అన్నం తింటుంటారు. కానీ బరువు తగ్గాలంటే ఏం తినాలో తెలుసా?
 


ఓవర్ వెయిట్ చాలా మంది ఎదుర్కొనే సర్వ సాధారణ సమస్య. ఈ బరువును తగ్గించుకోవడానికి స్పెషల్ డైట్ ను ఫాలో అవ్వడం, వాకింగ్  , జాగింగ్, ఎక్సర్ సైజ్ వంటివి రెగ్యులర్ గా చేస్తుంటారు. బరువు తగ్గాలంటే వీటితో పాటుగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని కూడా తీసుకోవాలి. 

అయితే చాలా మంది రాత్రిపూట అన్నాన్ని స్కిప్ చేస్తుంటారు. ఎందుకంటే అన్నం బరువును పెంచుతుందని. అయితే కొంతమంది అన్నానికి బదులుగా పోహాను తింటుంటారు. నిజానికి పోహా, బియ్యం రెండూ మన వంటకాల్లో ప్రధానమైనవి.

కానీ వీటి పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి భిన్నంగా ఉంటాయి. అసలు బరువు తగ్గాలనుకునేవారికి అన్నం మంచిదా; అటుకులు మంచివా? అనే సంగతిని ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Latest Videos


పోహాలోని పోషకాలు 

ఫ్లాట్ రైస్ లేదా అటుకులు అని కూడా పిలువబడే పోహాను కూడా చాలా మంది బ్రేక్ ఫాస్ట్ లో తింటుంటారు. పోహాలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తింటే మీ శరీరానికి తగినంత శక్తి అందుతుంది.

అయితే దీనిలో కేలరీలు, కొవ్వులు తక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది మీరు బరువు పెరగకుండా ఉండటానికి, అధిక బరువును తగ్గించుకోవడానికి బాగా సహాయపడుతుంది. దీన్ని బ్రేక్ ఫాస్ట్ లో తింటే మంచి ఫలితం ఉంటుంది. 
 

పోహాలో ఇనుము కూడా మెండుగా ఉంటుంది. ఇది శరీరంలో ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. పోహాలో విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.

ఇవి మీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచి మిమ్మల్ని అంటువ్యాధులు, ఇతర రోగాలకు దూరంగా ఉంచుతాయి. పోహాలో గ్లూటెన్ ఉండదు. ఉదరకుహర వ్యాధి ఉన్నవారికి ఇది మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. 

అన్నంలోని పోషకాలు 

భారతీయ వంటకాలతో సహా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల వంటకాల్లో బియ్యం ప్రధాన ఆహారం.  బియ్యం కార్బోహైడ్రేట్లకు మంచి వనరు. ఇది మన శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. అయినప్పటికీ పోహాతో పోలిస్తే బియ్యంలోనే కొవ్వు, కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి బరువును తగ్గాలనుకునేవారికి ఇది మంచిది కాకపోవచ్చు. 
 

వైట్ రైస్ తో పోలిస్తే బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే దీనిలో విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.  బ్రౌన్ రైస్ లో మెగ్నీషియం కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది ఎముకలను  ఆరోగ్యంగా ఉంచుతుంది.

అలాగే కండరాల పనితీరు, నరాల పనితీరుకు ఇది చాలా అవసరం. దీనిలో సెలీనియం వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి మీ శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కాపాడుతాయి. అయితే శరీర మంటను తగ్గిస్తాయి. 

పోహా వర్సెస్ రైస్: ఏది ఆరోగ్యకరమైనది?

ఆరోగ్య ప్రయోజనాల పరంగా చూసుకున్నట్టైతే పోహా, అన్నం రెండూ వాటి స్వంత ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. పోహా బ్రేక్ ఫాస్ట్ లేదా స్నాక్స్  గా బాగుంటుంది. ఇది ఈజీగా జీర్ణమవుతుంది. అలాగే దీనిలో కొవ్వు, కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. 

ఇక అన్నంలో బ్రౌన్ రైస్, తృణధాన్యాలు మంచివి. ఇవి మీ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే భోజనంలో అన్నం తినాలా? లేకపోతే పోహ తినాలా? అనేది మీ ఆహార ప్రాధాన్యతలు, ఆరోగ్యాన్ని బట్టి డిసైడ్ చేసుకోండి. 

click me!