చికెన్, మటన్ తో పెరుగును తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | Sep 19, 2024, 5:05 PM IST

పెరుగు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. కానీ కొన్ని రకాల ఆహారాలతో పెరుగును అస్సలు తినకూడదు. అవేంటో తెలుసా?
 

పెరుగు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనిలో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, విటమిన్ బి 12 వంటి ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ పెరుగును కొన్ని ఆహారాలతో మాత్రం అస్సలు తినకూడదు. 

పిల్లల నుంచి పెద్దల వరకు పెరుగును ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. కొంతమంది కూరలు లేకున్నా పెరుగుతో తింటుంటారు. పోషకాలు మెండుగా ఉండే పెరుగు మన ఎముకలను, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

అలాగే కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. ఒత్తిడిని తగ్గించడానికి, శారీరక అలసటను ఎదుర్కోవడానికి ఎంతగానో సహాయపడుతుంది. పెరుగులో ప్రోబాటిక్స్ సమృద్ధిగా ఉంటాయి. పెరుగును తింటే ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటుగా తొందరగా జీర్ణమవుతుంది. 

పెరుగు మన ఆరోగ్యానికి ఎంతటి మేలు చేసినా.. దీనిని కొన్ని ఆహారాలతో అస్సలు తినకూడదు. ఒకవేల తింటే మీరు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Latest Videos


మామిడి

మామిడి పండ్లను ఎప్పుడూ కూడా పెరుగుతో కలిపి తినకూడదు. పెరుగులో చలువ చేసే గుణం ఉంటుంది. ఇక మామిడి పండ్లు వేడి చేస్తాయి. కాబట్టి ఈ రెండింటిని కలిపి తింటే కడుపునొప్పి, అజీర్ణం వంటి సమస్యలతో పాటుగా మీరు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 

అరటి

అరటి పండ్లను తినేటప్పుడు కూడా మీరు పెరుగును తినకూడదు. జీర్ణక్రియను మెరుగుపరచడానికి అరటిపండ్లను  కొంతమంది ఎక్కువగా తింటుంటారు. కానీ ఇవి తిన్న వెంటనే మీరు పెరుగును తీసుకుంటే కడుపులో జీర్ణశక్తి మందగిస్తుంది. ఇది కడుపు నొప్పిని కలిగిస్తుంది. 
 

yogurt

మాంసాలు:

చికెన్, మటన్ వంటి మాంసాలను తిన్న తర్వాత చాలా మంది చివర్లో పెరుగును ఖచ్చితంగా తింటుంటారు. కానీ మాంసంతో పెరుగును అస్సలు తినకూడదు. ఎందుకంటే మాంసంలో ప్రోటీన్, పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ సమస్యలను కలిగిస్తుంది. 
 

కీర దోసకాయ

కీరదోసకాయను కూడా ఎట్టి పరిస్థితిలో పెరుగుతో కలిపి తినకూడదు. ఎందుకంటే ఈ రెండూ జలుబు స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ రెండింటిని కలిపి తింటే మీకు దగ్గు, జలుబు, సైనస్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండండి. 


అలాగే  పెరుగును పాలు, ఉల్లిపాయలు, వేయించిన ఆహారాలు, గింజలు, జున్ను మొదలైన వాటితో కూడా తినకూడదు. దీనివల్ల మీరు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు దీనికి దూరంగా ఉండండి. అలాగే పెరుగును అతిగా కూడా తినకూడదు. అలాగే మధ్యాహ్నం పెరుగు తింటే చాలా మంచిది.

click me!