ఈ 5 ఆహారాలతో విటమిన్ డి లోపానికి చెక్ చెప్పండి

First Published Sep 19, 2024, 11:21 PM IST

విటమిన్ డి లోపం వల్ల శరీరంలో పైకి కనిపించని రోగాలు పుట్టుకొస్తాయి. సాధారణంగా విటమిన్ డి సూర్యరశ్మిలో ఉంటుంది. అయితే ఉదయం ఎండను ఆస్వాధించలేని వారు ఆహార నియమాలు మార్చుకోవాలి. వారు పుట్టగొడుగుల నుండి కొవ్వు చేపలు, గుడ్డు పచ్చసొన వరకు ఈ విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి.

కొవ్వు చేపలు

విటమిన్ డి లోపం ఉన్నవారు మాకేరెల్, సాల్మన్, ట్యూనా వంటి కొవ్వు చేపలను తీసుకోవాలి. ఎందుకంటే అవి విటమిన్ డి, ఇతర ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. కొవ్వు చేపల్లో ఆటో ఇమ్యూన్ వాధులు రాకుండా నిరోధించే శక్తి ఉంటుంది. అంటే మన శరీరంలోని మంచి కణజాలంపై ఇమ్యూన్ సిస్టమ్ పొరపాటున దాడి చేస్తుంది. దీన్నే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. కొవ్యు చేపలు తినడం వల్ల ఇలాంటి వ్యాధులు రావు. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. డిప్రెషన్ ను దూరం చేస్తాయి.  

గుడ్డు పచ్చసొన

గుడ్లు.. ముఖ్యంగా గుడ్డు పచ్చసొనలో విటమిన్ డి అధికంగా ఉంటుంది. మీ ఆహారంలో గుడ్లను చేర్చుకోవడం విటమిన్ డి పొందడానికి సులభమైన పద్ధతి. గుడ్డు పచ్చసొనలో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. సెలీనియం, విటమిన్ ఎ, విటమిన్ డి, బి6, బి12, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటితో పాటు జింక్, ఫాస్పరస్ సహా అనేక విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. జలుబు, దగ్గు వచ్చినప్పుడు గుడ్లు తినడం చాలా ప్రయోజనకరం. అలాగే గుడ్డులోని పచ్చసొనలో మనకు అవసరమైన పది రకాల పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 

Latest Videos


పుట్టగొడుగులు

పుట్టగొడుగుల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. వీటిలో విటమిన్ డి కూడా ఉంటుంది. వాటికి తగినంత సూర్యరశ్మి ఉంటే అవి విటమిన్ డిని సృష్టించగలవు. పుట్టగొడుగులలో బి విటమిన్లు, రిబోఫ్లేవిన్, ఫోలేట్, థియామిన్, పాంతోతేనిక్ ఆమ్లం, నియాసిన్ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి మనం తీసుకునే ఆహారం నుండి శక్తిని వినియోగించుకోవడానికి, శరీరమంతా ఆక్సిజన్‌ను తీసుకువెళ్ళే ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి శరీరానికి సహాయపడతాయి. పుట్టగొడుగులు గుండె ఆరోగ్యానికి మంచివి. అల్జీమర్స్ ను తగ్గిస్థాయి. ఇవి మనుషులను యవ్వనంగా ఉంచుతాయి. 

రొయ్యలు

రొయ్యల్లో కొవ్వు తక్కువగా ఉంటాయి. కానీ విటమిన్ డి అధికంగా ఉంటుంది. సరిగ్గా వండినప్పుడు అవి అద్భుతంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన సముద్ర ఆహారాల్లో రొయ్యలు ఒకటి. రొయ్యలో క్యాలరీలు తక్కువగా, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇది మొత్తం తొమ్మిది అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. అధిక మొత్తంలో జింక్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి. సెల్ డ్యామేజ్‌ను నివారిస్తుంది. కాల్షియం, ఇతర ఖనిజాలు ఇందులో ఉండటం వల్ల ఎముకలు, కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి.

ఓయిస్టర్లు

ఓయిస్టర్లు కూడా విటమిన్ డి అధికంగా ఉంటాయి మరియు శరీరంలో విటమిన్ డి స్థాయిలను పెంచడానికి తీసుకోవచ్చు. అవి జింక్‌లో కూడా అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఒమేటా 3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ 12 ఉండటం వల్ల మెదడు పనితీరు బాగా పనిచేస్తుంది. వీటిల్లో ఉన్న పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు గుండె, ఎముకలను స్ట్రాంగ్ గా మారుస్తాయి. వీటిల్లోొ తక్కువ కాలరీలు, కొవ్వు ఉండటం వల్ల బరువు పెరగకుండా ఉంటారు. 

click me!