ఈ రోజుల్లో ఎక్కువ మంది అనారోగ్యానికి గురవ్వడానికి కారణం ఏంటి..? సరైన.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం వల్లనే. కొందరు.. లేదు... మేము ప్రతిరోజూ పండ్లు, కూరగాయలు మాత్రమే తింటూ ఉంటాం. అయినా త్వరగా జబ్బున పడుతుంటాం అని సమాధానమిస్తూ ఉంటారు. అయితే.. దాని వెనక కూడా కారణం ఉంది. క్రిమి సంహారక మందుల సహాయంతో పెరిగే ఆహారానికీ.. ఆర్గానిక్ ఆహారానికి మధ్యచాలా తేడా ఉంటుంది.
organic food cheeting
అందుకే.. ఆర్గానిక్ ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. ఈ ఆర్గానికి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని మన సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే.. దీని వల్ల ఆరోగ్యం మాత్రమే కాదు... మెరిసిపోయే అందం కూడా సొంతమౌతుందట.
ఆర్గానిక్ ఫుడ్స్ దీనినే సేంద్రియ ఆహారం అని కూడా అంటారు. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ సీ, ఐరన్, మెగ్నీషియం, పాస్పరస్ వంటి పోషకాలు పెరుగుతాయి. ఇవన్నీ శరీరానికి అందడం వల్ల త్వరగా జబ్బున పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా అందంగా కనపడతారు
immunity
ఆర్గానిక్ ఫ్రూట్స్.. ఈ మధ్యకాలంలో ఆర్గానిక్ ఆహారంపై చాలా మంది దృష్టిపడింది. దీంతో.. ఎలాంటి పురుగు ముందులు కొట్టకొండా.. పండ్లను పెంచుతున్నారు. ఇవి తినడం వల్ల మనకు చాలా ఆరోగ్యం లభిస్తుంది. అయితే.. ఇవి రుచిగా ఉంటాయని మాత్రం చెప్పలేం. కానీ.. ఆరోగ్యానికి మాత్రం ఇస్తాయి. ఈ సేంద్రియ పండ్లను తినడం వల్ల.. ముఖం పై మొటిమల సమస్య తగ్గుముఖం పడుతుంది.
ఆర్గానిక్ సీడ్స్.. గింజలు, విత్తనాల్లో కొవ్వు ఉంటుంది. కానీ.. అవి శరీరానికి మంచి చేస్తుంది. దీని వల్ల బరువు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. శరీరానికి మెగ్నీషియం, విటమిన్ ఈ వంటి పోషకాలను నింపే సూపర్ ఫుడ్ ఇది. ఇవి తరచూ తినడం వల్ల చర్మం మృదువుగా అందంగా కనపడుతుంది.
flax seeds
ఆర్గానిక్ బెర్రీస్.. రెగ్యులర్ డైట్ లో బెర్రీస్ కి చోటు కల్పించాలి. వీటిని ప్రతిరోజూ తీసుకుంటూ ఉండాలి. ఇవి తినడం వల్ల చర్మం పై ముడతలు రాకుండా ఉంటాయి. దీంతో.. అందంగా, యవ్వనంగా కనపడతారు.
Berries
ఆర్గానిక్ కూరగాయలు.. ఎలాంటి పురుగు ముందులు లేకుండా ఈ కూరగాయలను పెంచుతాము కాబట్టి.. వీటిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోజూ తినడం వల్ల బ్రెయిన్ చురుకుగా పనిచేస్తుంది. ఉబకాయం వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.
Shravana-Green vegetables