ఒక్క పిజ్జా ముక్క.. మీ జీవితాన్ని ఎంత తగ్గిస్తుందో తెలుసా..?

First Published | Sep 1, 2021, 1:50 PM IST

మన జీవితంలో  ఎన్నో రకాల సమస్యల నుండి ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయం చేస్తుంది. అందేకాదు.. పీనట్ బటర్ తినడం వల్ల జీవితం అరగంట పెరుగుతుంది. కానీ పిజ్జా మాత్రం జీవిత కాలాన్ని తగ్గించేస్తుందట.

మనలో చాలా మందికి పిజ్జా అంటే ఇష్టం. వేడి వేడిగా ఉండే చీజ్ పిజ్జా.. నోట్లో పెట్టుకుంటే ఓ అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే..పిజ్జా చాలా రుచిగా ఉంటుంది. ఈ పిజ్జాలో ఎన్నో రకాలు కూరగాయలు, పన్నీర్ వంటిని నచ్చిన టాపింగ్  గా ఎంచుకునే అవకాశం మనకు ఉంటుంది.

పిజ్జా పైన ఉపయోగించే టాపింగ్స్ ఆరోగ్యకరమైనవే. కానీ.. దాని కింద ఉండే పిజ్జా బేస్, దానిలో వాడే ఉప్పు, సాస్ లు మాత్రం ఆరోగ్యానికి హానికరమైనవే. కాగా.. అసలు పిజ్జా తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా అనే విషయంపై మిచిగాన్ యూనివర్శిటీకి చెందిన నిపుణులు సర్వే చేయగా.. పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.


pizza

బాదం పప్పు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది అనే విషయం మనకు తెలిసిందే. కాగా.. ప్రతిరోజూ.. బాదం పప్పు తినడం వల్ల మన జీవితంలో 26 నిమిషాలు పెరుగుతాయట. అంతేకాదు.. మన జీవితంలో  ఎన్నో రకాల సమస్యల నుండి ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయం చేస్తుంది. అందేకాదు.. పీనట్ బటర్ తినడం వల్ల జీవితం అరగంట పెరుగుతుంది. కానీ పిజ్జా మాత్రం జీవిత కాలాన్ని తగ్గించేస్తుందట.


అరటిపండు తినడం వల్ల 13.5 నిమిషాల జీవితకాలం, టమాట పండు తినడం వల్ల 3.5 నిమిషాలు, అవకాడో తినడం వల్ల 2.8 నిమిషాల జీవితకాలం పెరుగుతుంది. ఇక చేప తినడం వల్ల  16 నిమిషాల జీవితకాలం పెరుగుతుంది.

pizzaఅదేవిధంగా.. పిజ్జా తినడం వల్ల మన జీవితంలో 8 నిమిషాలు తగ్గిపోతాయట. ఇక కూల్ డ్రింక్స్ తాగడం వల్ల మన జీవితం 12.04 నిమిషాల జీవితం తగ్గిపోతుంది. ఇక బర్గర్లు, ప్రాసెస్డ్ మాంసం తినడం వల్ల కూడా ఆయుష్షు తగ్గిస్తుంది. కాబట్టి.. వాటిని తినడం మానేయడమే బెటర్.

Vada Pav Pizzaమీరు పెప్పరోని వంటి మాంసాలతో పిజ్జా తింటే, అది ఊబకాయం, కొన్ని క్యాన్సర్ మరియు గుండె సమస్యలను కలిగిస్తుంది. ఈ ప్రాసెస్ చేసిన మాంసాలను ఎక్కువగా తినడం గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

పిజ్జాలో సోడియం స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. మీరు ప్రతిరోజూ అలాంటి పిజ్జా తింటే, అది అధిక రక్తపోటుకు దారితీస్తుంది. మీరు ఒకేసారి మొత్తం పిజ్జా తింటే, మీరు మీ రోజువారీ సోడియం తీసుకోవడం అధికంగా చేస్తున్నారని అర్థం. దీనివల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది గుండె సమస్యలను కలిగిస్తుంది.

pizza

అమెరికాలో ప్రాసెస్ చేసిన మాంసాన్ని తినే వ్యక్తుల సగటు వయస్సు 0.45 నిమిషాలు తగ్గుతోందని ఈ అధ్యయనం కనుగొంది. దీని అర్థం హాట్ డాగ్ శాండ్‌విచ్‌లో 61 గ్రాముల ప్రాసెస్ చేసిన మాంసం ఒక వ్యక్తి జీవితాన్ని 27 నిమిషాలు తగ్గిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు వాటిని తినడం మానుకోండి.

అలాకాదు అంటే.. ప్లాంట్ బేస్డ్ ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. దాని వల్ల ఎలాంటి అనారోగ్యం దరిచేరదు.
 

Latest Videos

click me!