హోటల్లో ఎలాంటి వంటకాలైనా పర్ఫెక్ట్ గా వస్తాయి. వీటిలో పూరీలు ఒకటి. పూరీలు హోటల్లో బెలూన్ లా పొంగుతాయి. ఎంతో సాఫ్ట్ గా, మెత్తగా కూడా ఉంటాయి. కానీ ఇంట్లో తయారుచేసిన పూరీలు మాత్రం గట్టి గట్టిగా, రొట్టెల్లా అవుతుంటాయి. ముఖ్యంగా పూరీలు పొంగనే పొంగవు. పూరీలు ఉబ్బడానికి ఏం చేయాలో అన్నీ చేస్తుంటారు. అయినా పూరీలు మాత్రం పొంగవు. మెత్తగా రావు. హోటల్ స్టైల్లో పూరీలు పొంగాలన్నా, మెత్తగా రావాలన్నా ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
మైదా
పూరీలు మెత్తగా, బెలూన్ లా పొంగడానికి మైదా కూడా సహాయపడుతుంది. ఇందుకోసం పావు వంతు గోధుమ పిండి అంటే మీరు 750 గ్రాముల గోధుమ పిండిని ఉపయోగిస్తే.. దానిలో 250 గ్రాముల మైదా పిండిని వేసి కలపండి. మీకు తెలసా? మైదా పిండి నూనెను ఎక్కువగా పీల్చుకోదు. దీంతో పరీగా మెత్తగా వస్తాయి. ఉబ్బుతాయి.
సెమోలినా
సెమోలీనా తో కూడా పూరీలు బాగా పొంగేలా చేయొచ్చు. ఇందుకోసం మైదా వంటి గోధుమ పిండిలో సెమోలినా కలిపితే పూరీలు మెత్తగా ఉంటాయి. బాగా ఉబ్బుతాయి. ఇందుకోసం ఒక కప్పు గోధుమ పిండిలో 2 టీస్పూన్ల సెమోలినాను కలిపి పూరీలను తయారుచేయండి.
చక్కెర
చక్కెర కూడా పూరీలు బెలూన్ లా ఉబ్బడానికి, మెత్తగా రావడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇందకోసం ఒక కప్పు పూరీ పిండిలో ½ టీస్పూన్ పంచదారను వేసి కలపండి. చక్కెర వల్ల పూరీలు బెలూన్ లా ఉబ్బడమే కాకుండా.. పూరీలు మంచి బంగారు రంగులోకి కూడా వస్తాయి.
టాపియోకా పిండి
టాపియోకా పిండితో కూడా పూరీలు బాగా ఉబ్బుతాయి. సాఫ్ట్ గా కూడా ఉంటాయి. ఇందుకోసం పూరీల పిండిని రోలింగ్ చేసే లేదా రోల్ చేసిన గోధుమపిండిపై దీన్ని చల్లండి. దీనివల్ల పూరీలు బాగా ఉబ్బుతాయి.
కట్ చేయండి
పూరీలు చేయడానికి పిండిని బాగా కలుపుకుంటారు. ఆ తర్వాత చేతులను చిన్న చిన్న లడ్డూలా తయారు చేసి పూరీలను తయారుచేస్తారు. కానీ మీరు ఈ పిండిని మీ చేతితో లడ్డూల్లా తయారుచేయడానికి మీరు కావలసిన మొత్తాన్ని కత్తితో కట్ చేయండి. దీంతో పిండి ఒకే పరిమాణంలోకి వస్తుంది. దీంతో పూరీలు కూడా బాగా వస్తాయి.
poori
సైజ్
పూరీలను ఒక నిర్దిష్ట సైజులో తయారుచేయాలి. అప్పుడే పూరీలు బాగా వస్తాయి. కానీ చాలా మంది పూరీల సైజు కంటే.. ఎక్కుక పెద్దగా తయారుచేస్తారు. దీంతో పూరీల్లా కాకుండా.. ఇవి చపాతీలాగ కనిపిస్తాయి. గట్టిగా కూడా అవుతాయి.