Healty Food: పోహ, ఉప్మా లో పోషకాలు ఉంటాయా..?

First Published | May 30, 2022, 2:46 PM IST

అదే విధంగా ఆరోగ్యానికి కూడా సహాయం చేస్తాయని భావిస్తూ ఉంటారు. అయితే.. మనం తీసుకునే ఈ లైట్ ఫుడ్స్ లో పోషకారాల సంగతి ఏంటి..? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఓసారి చూద్దాం..
 

బరువు తగ్గాలని ఆశ పడేవారు మనలో చాలా మందే ఉన్నారు. ఈ బరువు తగ్గాలి అనుకునేవారంతా ముందుగా చేసే పని ఆహారం తినడం మానేయడం. లేదంటే.. తాము రోజూ తింటున్న ఆహారానికి బదులు లైట్ ఆహారాలుగా భావించే ఉప్మా, పోహ, మరమరాలు లాంటివి తదింటూ ఉంటారు. 

ఇవి తినడం వల్ల బరువు పెరిగే భయం ఉండదని.. అదే విధంగా ఆరోగ్యానికి కూడా సహాయం చేస్తాయని భావిస్తూ ఉంటారు. అయితే.. మనం తీసుకునే ఈ లైట్ ఫుడ్స్ లో పోషకారాల సంగతి ఏంటి..? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఓసారి చూద్దాం..


తేలికపాటి ఆహారాలు తీసుకోవడం వల్ల  ఆరోగ్యంగా ఉండటంతో పాటు... జీర్ణం బాగా అవుతుందని నమ్ముతుంటారు. సులభంగా జీర్ణమయ్యే ఈ ఆహారం.. మనకు పోషక విలువలను అందిస్తుందా లేదా అనే సందేహం చాలా మందిలో ఉండొచ్చు. ఆ సందేహంలో నిజం లేకపోలేదట.  వీటిలో పోషక విలువలు చాలా తక్కువగా ఉంటాయట.

ఈ లైట్ ఫుడ్ కి బదులుగా... ఆరోగ్యకరంగా ఉండే.. రోటీ, పప్పు తీసుకోవచ్చట. తేలిక ఆహారం త్వరగా జీర్ణమౌతుందట. కానీ.. వాటిలో కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి. కానీ ఫైబర్, ప్రోటన్లు ఉండవట. వాటిని తీసుకోకపోవడే ఉత్తమం.

vegetables

అయితే.. ఏదైనా అనారోగ్యం తో ఉన్నప్పుడు మాత్రం ఈ తేలిక పాటి ఆహారాలు నిస్సందేహంగా తీసుకోవచ్చట. కానీ అలా కాకుండా... మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రం.. వాటిని తీసుకోకపోవడమే ఉత్తమం. 

లేదంటే ఆ ఆహారాలు అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ రూపాల్లో అధిక కార్బోహైడ్రేట్ తీసుకోవడం దారితీస్తాయి. లైఫ్ ష్టైల్ కి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

మంచి ఆరోగ్యాన్ని నిర్ధారించుకోవడానికి.. ఈ తేలిక పాటి ఆహారానికి  పెరుగు, పప్పు, సాంబార్ మొదలైన తక్కువ GI ఆహారాలతో కలిపి ఇటువంటి ఆహారాలను తీసుకోవాలని నిపుణులు సూచించారు. పంచదార, మైదా లాంటివి ఎంత ప్రమాదకరమో.. ఈ తేలిక ఆహారాలు కూడా అంతే ప్రమాదకరమని గుర్తుంచుకోవాలి.

Latest Videos

click me!