ఇవి తిన్న తర్వాత వాటర్ తాగకూడదు... ఎందుకో తెలుసా?

First Published | Mar 9, 2024, 4:00 PM IST

కొన్ని రకాల ఫుడ్స్ తిన్న తర్వాత మనం పొరపాటున కూడా వాటర్ తాగకూడదు. మరి అలాంటి ఫుడ్స్ ఏంటి..? ఏవి తిన్న తర్వాత నీరు తాగకూడదు..? ఎందుకు తాగకూడదు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
 

మనం జీవించడానికి ఆహారం ఎంత ముఖ్యమో... నీరు కూడా అంతే ముఖ్యం. కచ్చితంగా మంచినీరు తాగాలి. రోజులో కనీసం తక్కువలో తక్కువ నాలుగు లీటర్ల వాటర్ తాగాలి అని నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే..  మంచినీరు తాగడం మంచిదే కానీ... కొన్ని సమయాల్లో మాత్రం కాదు. అది ఎప్పుడంటే.. కొన్ని రకాల ఫుడ్స్ తిన్న తర్వాత మనం పొరపాటున కూడా వాటర్ తాగకూడదు. మరి అలాంటి ఫుడ్స్ ఏంటి..? ఏవి తిన్న తర్వాత నీరు తాగకూడదు..? ఎందుకు తాగకూడదు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
 

1.పుచ్చకాయ..

ఎండాకాలం వచ్చేసింది. దాదాపు మార్కెట్లో ఎక్కడ చూసినా మనకు వాటర్ మిలన్స్ కనపడుతూనే ఉంటాయి. సమ్మర్ కదా.. మనం కూడా కొనుక్కొని ఆ పండును ఆస్వాదిస్తూ... ఎండ వేడిని తగ్గించుకుంటూ ఉంటాం. అయితే... ఈ పుచ్చకాయ తిన్న తర్వాత  పొరపాటున కూడా నీరు తాగకూడదు. ఎందుకంటే.. ఆల్రెడీ పుచ్చకాయల నీటి శాతం ఉంటుంది. మళ్లీ అదనంగా వాటర్ తాగితే.. డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది.

Latest Videos


2.అరటిపండు..
మనలో చాలా మంది చేసే పొరపాటు ఇది. అరటిపండు తిన్న తర్వాత కూడా వాటర్ తాగకూడదు. చాలా మంది పిల్లలకు అరటి పండు తినిపించి.. తర్వాత వెంటనే నీరు తాగిస్తూ ఉంటారు. అలా చేయకూడదు. దాని వల్ల బ్లడ్  వాల్యూమ్ పెరుగుతుంది.
 

3.యాపిల్..
యాపిల్ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. అసలు రోజూ ఒక యాపిల్ తింటే... డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు అని చెబుతూ ఉంటారు. కానీ.. యాపిల్ తిన్న తర్వాత వాటర్ తాగకూడదు. దాని వల్ల అరుగుదల సమస్యలు వస్తాయి.
 

pomegranate

4.దానిమ్మ..
దానిమ్మ పండు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే.. ఇది తిన్న తర్వాత కూడా... పొరపాటున కూడా వాటర్ తాగకూడదు. దాని వల్ల.. స్టమక్ అప్ సెట్ అవుతుంది. వాంతులు అవ్వడం లాంటివి కూడా జరుగుతాయి.

5.నారింజ పండ్లు..
నారింజ పండ్లలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఈ ఫండు ఆరోగ్యానికి చాలా మంచిది.  అయితే... ఇది తిన్న తర్వాత కూడా.. వాటర్ తాగకూడదు. అలా తాగితే.. బాడీలో పీహెచ్ విలువల్లో మార్పులు వస్తాయి. డైజెషన్ సమస్యలు కూడా వస్తాయి.

click me!