డిన్నర్ తొందరగా ఎందుకు చేయాలి..?

First Published | Mar 9, 2024, 2:00 PM IST

భోజనం చాలా తొందరగా చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అని నిపుణులు చెబుతున్నారు. మరి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

రాత్రి భోజనం స్పెషల్ గా ఉండాలని చాలా మంది ఫీలౌతూ ఉంటారు. ఉదయం ఎలా తిన్నా.. రాత్రి పడుకునే ముందు కమ్మగా నచ్చిన ఆహారం తినాలి అనుకునేవారు కూడా ఉన్నారు. అయితే.. ఏ ఆహారం తింటున్నారనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. ఏ సమయంకి తింటున్నారు అనే విషయంలో మాత్రం  జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అంటున్నారు. చాలా మంది డిన్నర్ అంేట... కనీసం రాత్రి 10 కావాలని అంటూ ఉంటారు. కానీ... ఆలస్యంగా భోజనం చేయడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. అంతేకాదు... భోజనం చాలా తొందరగా చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అని నిపుణులు చెబుతున్నారు. మరి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

1. ఆలస్యంగా భోజనం చేయడం వల్ల అరుగుదల సమస్యలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. కానీ.. అదే డిన్నర్ ని కాస్త ముందు గా తినడం అలవాటు చేసుకుంటే అరుగుదల సమస్యలు పెద్దగా ఉండవు.  ఫుడ్ మంచిగా అరిగి.. తీసుకున్న ఆహారంలోని న్యూట్రియంట్స్ మన శరీరానికి అందడానికి సహాయపడతాయి.

Latest Videos


2.భోజనం ఆలస్యం అయితే.. పొట్ట అంతా ఫుల్ గా ఉంటుంది. తిన్న వెంటనే పడుకోవాలంటే కొంచెం కంఫర్ట్ గా అనిపించదు. దీంతో.. కాసేపు ఆగిపడుకుందాం అని ఆగిపోతాం. దాని వల్ల భోజనమే కాదు.. నిద్ర కూడా ఆలస్యమౌతుంది. అదే.. డిన్నర్ త్వరగా చేస్తే.. ఆ సమస్య ఉండదు.
 

3.ఆలస్యంగా డిన్నర్ చేయడం వల్ల బరువు విపరీతంగా పెరిగిపోతూ ఉంటారు. అదే కనక ముందుగా భొజనం పూర్తి చేయడం వల్ల  బరువు చాలా కంట్రోల్ లో ఉంటుంది. తీసుకునే ఆహారం విషయంలోనూ జాగ్రత్త పాటిస్తే.. బరువు తగ్గడానికి కూడా సహాయం చేస్తుంది.

Benefits of having early dinner

4.డిన్నర్ ని త్వరగా చేయడం వల్ల మన శరీరంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి. డయాబెటిక్స్ తో బాధపడేవారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
 

dinner

5.రాత్రి బోజనం వీలైనంత త్వరగా చేయాలి. మనం పడుకోవడానికి, రాత్రి డిన్నర్ తక్కువలో తక్కువ రెండు నుంచి మూడు గంటల గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం తీసుకున్న ఆహారం మంచిగా జీర్ణమౌతుంది. మన శరీరానికి కావాల్సిన ఎనర్జీ లెవల్స్ కూడా పెరుగుతాయి. దీని వల్ల ఎక్కువ సేపు ఉత్సాహంగా ఉంటాం.

6.త్వరగా డిన్నర్ పూర్తి చేయడం అనేది మన హార్ట్ హెల్త్ తో ముడిపడి ఉంటుంది. అంతేకాదు.. త్వరగా భోజనం చేయడం వల్ల హార్ట్ బర్న్ అవ్వడం, ఇన్ డైజెషన్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
 

dinner

7.వీటితోపాటు.. తొందరగా రాత్రి భోజనం పూర్తి చేయడం వల్ల.. మన శరీర మెటబాలిజం మెరుగుపడుతుంది.  దాని వల్ల పూర్తి ఆరోగ్యంతో ఉండగలుగుతారు. శారీరకంగా మాత్రమే కాకుండా.. మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. 

click me!