నిమ్మకాయలను ఎన్నో రకాల వంటల్లో ఉపయోగిస్తారు. సలాడ్లు, కూరగాయలు, కాయధాన్యాలు మొదలైన వాటిలో నిమ్మకాయను తీసుకుంటారు. ఇది ఫుడ్ ను టేస్టీగా చేస్తుంది. అంతేకాదు మన ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. నిమ్మకాయల్లో విటమిన్-సి పుష్కలంగా ఉంటుది. అలాగే కాల్షియం, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు కూడా దీనిలో ఎక్కువ మొత్తంలో ఉంటాయి. నిమ్మలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతాయి. నిమ్మకాయ మన ఆరోగ్యానికి ఎంత మేలు చేసినా.. వీటిని కొన్ని ఆహారాలతో కలిపి అసలే తినకూడదు. ఎందుకంటే ఇది మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కడుపు సంబంధిత సమస్యలు వచ్చేలా చేస్తుంది. మరి నిమ్మకాయతో ఎలాంటి ఆహారాలను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..