కరోనా వైరస్ చాలా శుభ్రతను నేర్పింది. ఇల్లాలికి పని ఎక్కువ చేసింది. ఇది వరకు కూరగాయలు, పండ్లు, బైటినుంచి తెచ్చే వస్తువులు నేరుగా స్టోర్ చేసుకునే వాళ్లం.. కానీ ఇప్పుడా పరిస్తితి లేదు.. వాటితో పాటు ఏ వైరస్ ఎలా వస్తుందో అనే భయం.. కడిగిందే.. కడిగి.. తుడిచిందే తుడిచి.. జాగ్రత్త పడుతున్నారు.
అలాగని బైటినుంచి కూరగాయలు, పండ్లు, అవసరమైన సరుకులు తెచ్చుకోకపోతే గడవదు. మరి ఎలా..? కూరగాయలతో పాటు వైరస్ దాంతో పాటు ఫంగల్ ఇన్ఫెక్షన్లు మోసుకొస్తున్నామా? అనే అనుమానం? ఇంట్లో తీసుకుంటున్న జాగ్రత్తలు.. శుభ్రం చేస్తున్న తీరు కరెక్టేనా? అనే సందేహం పీకుతూనే ఉంటుంది.
అలాగని బైటినుంచి కూరగాయలు, పండ్లు, అవసరమైన సరుకులు తెచ్చుకోకపోతే గడవదు. మరి ఎలా..? కూరగాయలతో పాటు వైరస్ దాంతో పాటు ఫంగల్ ఇన్ఫెక్షన్లు మోసుకొస్తున్నామా? అనే అనుమానం? ఇంట్లో తీసుకుంటున్న జాగ్రత్తలు.. శుభ్రం చేస్తున్న తీరు కరెక్టేనా? అనే సందేహం పీకుతూనే ఉంటుంది.
అయితే నిజానికి పండ్లు, కూరగాయలు, ఆహారం, వస్తువుల వల్ల కరోనా రాదు. కాకపోతే అవి అమ్ముతున్న వ్యక్తులకు, ఫుడ్ డెలివరీ చేస్తున్న వారికి కరోనా ఉంటే.. వాటిని తీసుకునేవారికి ప్రమాదం ఉంటుంది. అందుకే నేషనల్ న్యూట్రీషన్ ఇనిస్టిట్యూట్ ఆహారం విషయంలో తీసుకునే జాగ్రత్తలకు కొన్ని గైడ్ లైన్స్ విడుదల చేసింది.
కూరగాయలను ఎలా శుభ్రం చేయాలి...?రన్నింగ్ ట్యాప్ కింద పారుతున్న నీటితో కూరగాయలు, పండ్లను కడగాలి. గోరువెచ్చని నీటిలో క్లోరిన్ వేసి అందులో కూరగాయలు పండ్లను ఉంచి కడగాలి,
క్రిమిసంహారక మందులు, శానిటైజర్ లు నేరుగా కూరగాయల మీద చల్లొద్దు. దీనివల్ల కూరగాయలు, పండ్ల ద్వారా మరింత హాని కలిగించినవారమవుతాం.
శుభ్రంగా కడిగిన కూరగాయలను, పండ్లను ఫ్రిజ్లో భద్రపరచాలి. అలాగే నాన్ వెజ్ కూడా రన్నింగ్ ట్యాప్ కిందనీటితోనే కడగాలి. పాలు, పెరుగు ప్యాకెట్లను శుభ్రంగా కడిగి, వాటిని పొడి బట్టతో తుడిచి, తడి ఆరాకే వాడాలి. అలాగే ఫ్రిజ్ లో పెట్టాలి. పగిలిన లేదా పర్రెలు బారిన కోడిగుడ్లను తీసుకోవద్దు. ఫ్రిజ్ లో అలాంటివి అస్సలు ఉంచకూడదు.
ఆహారపదార్థాలను ఇంటికే తెప్పించుకుంటున్నట్లైతే...ఫుడ్ యాప్స్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నట్లైతే.. అవి రాగానే ప్యాకెట్లను శానిటైజ్ చేయాలి. కాకపోతే శానిటైజర్ ఆహారంపై పడకుండా చూసుకోవాలి. పై కవర్లను చెత్తకుండీలో వేసేయాలి.
ఆ తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కుని.. వాటిని చేతులతో తాకకుండా చెంచాలు, గరిటలతో వడ్డించాలి. ఇక వేడి పదార్థాలు వేడిగా ఉన్నప్పుడు.. చల్లటివి చల్లగా ఉన్నప్పుడే తినేయాలి.
బయట కొనేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు...ఎప్పుడూ తాజా కూరగాయలు మాత్రమే కొనండి. వాడిపోయినవి, దెబ్బతిన్నవి కొనొద్దు.మీరు సొంతంగా చేతి సంచిని తీసుకెళ్ళండి. మీకు కావలసిన కూరగాయలనే చేతితో తాకండి.
మీరు తీసుకున్న కూరగాయలు, మీ శరీరానికి, దుస్తులకు తగలకుండా జాగ్రత్తగా సంచిలో వేసుకుని తీసుకురండి.
నాన్ వెజ్ కొనేప్పుడు..అప్పుడే తాజాగా కోసిన మాంసాన్నే కొనండి. తెచ్చి ఫ్రిజ్ లో పెట్టి వాడాలనుకుంటే.. బాగా శుభ్రం చేసి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. ఇక స్టోర్డ్ నాన్ వెజ్ కొంటున్నట్లైతే అతి చల్లగా ఉండేలా తీసుకుని.. మనం వండే వరకు భద్రత పాటించాలి.ఇక మీరు మార్కెట్ నుంచి ఇంటికి వచ్చాక మీ చేతులు సబ్బుతో బాగా శుభ్రం చేసుకోవాలి. అర నిమిషం నుంచి నిమిషం వరకు సబ్బుతో బాగా రుద్ది కడుక్కోవాలి.
వండే టప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలుకూరగాయలు కోసే కత్తులతో కూరగాయలను మాత్రమే కోయాలి. అన్నింటికీ ఓకే కత్తిని వాడకూడదు.
శాకాహారం, మాంసాహారం ఇలా వేటికవే శుభ్రం చేయాలి. అన్నీ శుభ్రం చేశాకే చేతులు కడుక్కుంటామనుకోవద్దు. మధ్య మధ్యలో చేతులు సబ్బుతో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఆ తరువాత మళ్లీ చివరికి ఒకసారి నీట్ గా కడుక్కోవాలి.
కూరలు, పప్పులు, ఇగుర్లు ఫ్రిజ్లో పెట్టాలనుకుంటే..వేటికవి గాలి చొరబడని విధంగా మూతలు పెట్టి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా ఫ్రిజ్ ను చూసుకోవాలి.
వండి ఫ్రిజ్లో భద్రపరచిన కూరలు, పప్పులు ఫ్రిజ్ లోంచి తీసి వెంటనే వేడి చేసుకోవాలి. సాధారణంగా బయట కాసేపు పెట్టి వేడి చేయాలనుకోవడం మంచిది కాదు.ఇక చేతి వేళ్ళకు ఉన్న గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి.