పరమాన్నం.. పండుగలప్పుడు ప్రత్యేకంగా తయారు చేస్తారు. నెయ్యితో తాజా ఘుమఘమలతో వాసన చూడగానే కడుపులో ఆకలి కేకలే వేస్తుంది. ఇక బెల్లం పరమాన్నం రుచిలోనే కాదు, ఆరోగ్యానికీ ఎంతో మంచిది.
ఇలా నోట్లో వేసుకుంటే.. అలా కరిగిపోయే రుచికరమైన ఆ బెల్లం పరమాన్నం ఎలా తయారు చేయాలో.. చూడండి..
బెల్లం పరమాన్నం.. తయారీకి కావాల్సిన పదార్థాలు..400 గ్రాముల బాస్మతి బియ్యం250 గ్రాముల పొడి బెల్లం4 లవంగాలు4 కప్పుల నీరు100 గ్రాముల నెయ్యి1 12 టీస్పూన్ల ఏలకులు2 టేబుల్ స్పూన్ల తరిగిన బాదం ముక్కలు
బెల్లం పరమాన్నం.. తయారు చేసే విధానం..మొదట, బియ్యాన్ని 4-5 సార్లు కడిగి, 15-20 నిమిషాలు నానబెట్టండి.
ఆ తరువాత అడుగు మందంగా ఉన్న గిన్నెలో నీళ్లు పోసి మరుగు పట్టేదాకా చూడాలి. నీల్లు మరుగుతున్నప్పుడు దాంట్లో లంగాలతో పాటు, నానబెట్టిన బియ్యం కూడా వేసి కలపాలి.
ఇప్పుడు బియ్యం పూర్తిగా ఉడికి మృధువైన అన్నంగా మారాలి. నీరు పూర్తిగా ఇగిరి పోవాలి. ఇప్పుడు మరో పాన్ లో మీడియం మంట మీద నెయ్యి వేడిచేయండి. దీనికి బెల్లం పొడిని కలపండి. ఇది పూర్తిగా కరిగి కరగాలి.
ఇప్పుడు బియ్యం పూర్తిగా ఉడికి మృధువైన అన్నంగా మారాలి. నీరు పూర్తిగా ఇగిరి పోవాలి. ఇప్పుడు మరో పాన్ లో మీడియం మంట మీద నెయ్యి వేడిచేయండి. దీనికి బెల్లం పొడిని కలపండి. ఇది పూర్తిగా కరిగి కరగాలి.
బెల్లం పూర్తిగా కరిగి ద్రవంగా అయినతరువాత కాసేపు ఉడకనిచ్చి ఇందులో అన్నం, ఏలకుల పొడి వేసి బాగా కలపండి. ఆ తరువాత మంటను పూర్తిగా తగ్గించి సిమ్ లో పెట్టి 5-8 నిమిషాలు ఉడికించాలి.
దీనిమీద బాదం ముక్కలు వేసి.. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది.
దీనిమీద బాదం ముక్కలు వేసి.. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది.