గ్లాసుడు పాలకంటే... గుప్పెడు నువ్వులు నయమా..? రెండింటిలో ఏది బెటర్

First Published | Aug 6, 2024, 4:23 PM IST

పాలు తాగకపోతే శరీరంలో కాల్షియం తగ్గి.. కాళ్లు, చేతులు నొప్పి వస్తాయి అని నమ్ముతాం. కానీ.. పాలతో సమానంగా, పాలకంటే ఎక్కువ కాల్షియం ఉన్న ఫుడ్స్ కూడా ఉన్నాయి. వాటిలో..  నువ్వులు కూడా ఒకటి.
 

పాలు ఆరోగ్యానికి  చాలా మంచిది. ఈ విషయం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి.. ఇంట్లో  కచ్చితంగా పాలు తాగాల్సిందే అని చెప్పి నేర్పుతారు. మనం మన పిల్లల విషయంలోనూ అదే ఫార్ములా కంటిన్యూ చేస్తూ ఉంటాం. మనం పాలు ఎందుకు తాగుతాం...? కాల్షియం కోసం. ఎందుకంటే.. పాలు తాగకపోతే శరీరంలో కాల్షియం తగ్గి.. కాళ్లు, చేతులు నొప్పి వస్తాయి అని నమ్ముతాం. కానీ.. పాలతో సమానంగా, పాలకంటే ఎక్కువ కాల్షియం ఉన్న ఫుడ్స్ కూడా ఉన్నాయి. వాటిలో..  నువ్వులు కూడా ఒకటి.
 

నువ్వుల్లోనూ కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇతర విటమిన్లు, పోషకాలు కూడా ఉంటాయి. అయితే.. ఇప్పుడు పాలు, నువ్వులు రెండింటిలో ఏది మంచిది అంటే నిపుణులు నువ్వులకే ఓటు వేస్తున్నారు. గ్లాసుడు పాలు తాగేకంటే... గుప్పెడు నువ్వులు తింటే చాలు అని చెబుతున్నారు.


నువ్వులు , పాలు రెండింటిలోనూ కాల్షియం అధికంగా ఉంటుంది. నువ్వుల కంటే పాలలో కార్బోహైడ్రేట్లు 4.3 రెట్లు తక్కువ.
నువ్వుల గింజల్లో ఎక్కువ థయామిన్, నియాసిన్, విటమిన్ B6, ఫోలేట్ ఉన్నాయి, అయినప్పటికీ, పాలలో ఎక్కువ పాంతోతేనిక్ యాసిడ్ ,విటమిన్ B12 ఉంటాయి. నువ్వుల గింజలు డైటరీ ఫైబర్, ఐరన్, పొటాషియం , ప్రోటీన్లకు అద్భుతమైన మూలం.
 

మరి.. 100 గ్రాముల నువ్వులు, 100 ఎంఎల్ పాలల్లో.. ఏది ఎక్కువ పోషకాలు కలిగి ఉంటుందో చూద్దాం...

1.నువ్వులు..
100 గ్రాముల నువ్వుల్లో 
కేలరీలు: 573 కేలరీలు
ప్రోటీన్: 17 గ్రాములు
కొవ్వులు: 50 గ్రాములు
   - శ్రేయస్సుల కొవ్వులు: 6.7 గ్రాములు
   - సంతృప్త కొవ్వులు: 14.2 గ్రాములు
కార్బోహైడ్రేట్లు: 23.5 గ్రాములు
   - చక్కెరలు: 0.3 గ్రాములు
   - ఫైబర్: 11.8 గ్రాములు
కాల్షియం:975 మిల్లీగ్రాములు
ఐరన్: 14.55 మిల్లీగ్రాములు
మెగ్నీషియం: 351 మిల్లీగ్రాములు
ఫాస్పరస్: 629 మిల్లీగ్రాములు
పోటాషియం: 468 మిల్లీగ్రాములు

milk

ఆవుపాలు.. 
100ఎంఎల్ ఆవు పాలల్లో..
కేలరీలు: 42 కేలరీలు
ప్రోటీన్: 3.4 గ్రాములు
కొవ్వులు:*1 గ్రాములు
   - శ్రేయస్సుల కొవ్వులు: 0.6 గ్రాములు
   - సంతృప్త కొవ్వులు: 0.6 గ్రాములు
కార్బోహైడ్రేట్లు: 5 గ్రాములు
   - చక్కెరలు: 5 గ్రాములు (సాధారణంగా లాక్టోస్)
   - ఫైబర్: 0 గ్రాములు
కాల్షియం: 120 మిల్లీగ్రాములు
6. ఐరన్: 0.03 మిల్లీగ్రాములు
7. మెగ్నీషియం: 10 మిల్లీగ్రాములు
8. ఫాస్పరస్: 95 మిల్లీగ్రాములు
9. పోటాషియం:*150 మిల్లీగ్రాములు


రెండింటినీ పోల్చినప్పుడు.. నువ్వుల్లో కాల్షియం, ఐరన్, కేలరీలు పాలకంటే ఎక్కువగా ఉన్నాయి. కానీ ఆవు పాలల్లో కేలరీలు, ఫ్యాట్స్ తక్కువగా ఉంటాయి.. కానీ ప్రోటీన్, కాల్షియం ఎక్కువ గా ఉంటాయి. రెండూ ఆరోగ్యానికి మంచివే. కానీ.. మీ శరీరానికి ఏది అవసరం అని తెలుసుకొని.. వాటిని తీసుకోవడం ఉత్తమం. 
 

Latest Videos

click me!