వండే ముందు బియ్యాన్ని నానబెడితే ఏమౌతుందో తెలుసా?

First Published | Aug 6, 2024, 12:43 PM IST

చాలా మంది అన్నం వండేముందు బియ్యాన్ని రెండు మూడు సార్లు బాగా కడిగి ఒక గంట లేదా అర్థగంట పాటు నానబెడుతుంటారు. కానీ ఇలా నానబెడితే ఏం జరుగుతుందో తెలుసా?
 

మన దేశంలో బియ్యమే ప్రధాన ఆహారం. చాలా మంది మూడు పూటలా అన్నాన్నే తింటుంటారు. అయితే ఇప్పుడే కాకుండా.. మన అమ్మమ్మల కాలం నుంచి అన్నం వండటానికి ముందు బియ్యాన్ని కడిగి గంటల లేదా అర్థగంట ఇలా పక్కన పెట్టేస్తుంటారు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల బియ్యం బాగా నాన తొందరగా అన్నం అవుతుంది. ఇది నిజమే. దీనివల్ల గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. అయితే ఇలా వండేముందు బియ్యాన్ని నానబెడితే ఏం జరుగుతుందో తెలుసా? 

rice

బియ్యాన్ని నానబెడితే

అన్నం వండటానికి ముందు బియ్యాన్ని కాసేపు నానబెట్టే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే ఈ పద్దతిలో అన్నం వండితే గ్యాస్ సేవ్ అవుతుంది. అంతేకాదు ఇలా బియ్యాన్ని నానబెట్టి వండటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేంటంటే? 


బ్లడ్ షుగర్ లెవెల్స్ 

అన్నాన్ని డయాబెటీస్ ఉన్నవారు తినకూడదని చెప్తుంటారు. ఎందుకంటే బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను బాగా పెంచుతాయి. అయితే మీరు అన్నం వండటానికి ముందు బియ్యాన్ని నీళ్లలో నానబెట్టడం వల్ల దాని గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. దీంతో  అన్నాన్ని తిన్నా బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగవు. ఇలా అన్నాన్ని వండుకుని తినడం మధుమేహులకు  మేలు చేస్తుంది.


పోషకాలను గ్రహిస్తుంది

బియ్యంలో కూడా మన శరీరానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే మీరు  వండటానికి ముందు బియ్యాన్ని నీళ్లలో నానబెట్టడం వల్ల దానిలోని పోషకాలు బాగా గ్రహించబడతాయి. దీనివల్ల బియ్యంలోని పోషకాలు వృథా కావు.
 

జీర్ణం

చాలా మంది జీర్ణ సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా తిన్నది అరగకపోవడం,మలబద్దకం వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఇలాంటి వారు బియ్యాన్ని నానబెట్టి వండి తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. అవును ఈ పద్దతిలో అన్నాన్ని వండి తింటే మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
 

మంచి నిద్ర

నిజానికి బియ్యంలో  గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన నిద్రను చెడగొడుతుంది. అయితే మీరు బియ్యాన్నినానబెడితే వాటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా వరకు తగ్గుతుంది. ఈ అన్నాన్ని తింటే మీకు రాత్రిళ్లు బాగా నిద్రపడుతుంది. 
 


నానబెట్టే వ్యవధి

బియ్యాన్ని నానబెడితే మంచిది కదా అని గంటలకు గంటలు నానబెట్టినా పెద్దగా ప్రయోజనం ఉండదు. బియ్యాన్ని ఎక్కువసేపు నానబెడితే దానిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు నీటిలో కరిగిపోతాయి. కాబట్టి బియ్యాన్ని 15 నుంచి 20 నిమిషాలు మాత్రమే నానబెట్టాలి.
 

Latest Videos

click me!