రోజూ ఏదో ఒకరకమై పండు తినడం ఆరోగ్యకరమైన అలవాటు. కొంతమంది అయితే ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఫ్రూట్ బంచ్ నే తీసుకుంటారు. ఇక మరికొంతమంది ఆరెంజ్ జ్యూస్ తో తమ ఉదయాన్ని ప్రారంభిస్తారు.
ఇంకొంతమంది సంప్రదాయ బద్ధంగా భోజనం తరువాత పండ్లను తింటుంటారు. మరికొంతమంది అలా కాదు భోజనానికి ముందు పండ్లు తినాలని చెబుతుంటారు.
అందుకే దీనిమీద అనేక రకాల వాదనలు వినిపిస్తాయి. అంతేకాదు పండ్లు భోజనం తరువాత తినాలా? ముందా? అనే దానిమీద కన్ఫ్యూజన్ ఉంటుంది.
దీనికి తగ్గట్టుగానే కొన్ని అధ్యయనాలు భోజనానికి ముందు పండ్లు తినాలని చెబితే మరికొన్ని అధ్యయనాలు మరొకటి భోజనం తరువాత తినడమే మంచిది అని తేల్చేస్తున్నాయి.
ఈ కన్ఫ్యూజన్ ను పొగొట్టడానికి యునైటెడ్ స్టేట్స్ కు అగ్రికల్చరల్ డిపార్ట్ మెంట్ ఓ అభిప్రాయానికి వచ్చింది. అదేంటంటే మీ లంచ్ ప్లేట్ లో సగం పండ్లు, సగం కూరగాయలతో ఉండాలని చెబుతున్నారు.
తాజా పండ్లు, కూరగాయలను మీ రోజువారీ ఆహారంలో చేర్చడం చాలా మంచి అలవాటని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల శరీరానికి విటమిన్లు, మినరల్స్, ఫైబర్, యాంటీయాక్సిడెంట్స్ లభిస్తాయి.
తాజా పండ్లు, కూరగాయలను మీ రోజువారీ ఆహారంలో చేర్చడం చాలా మంచి అలవాటని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల శరీరానికి విటమిన్లు, మినరల్స్, ఫైబర్, యాంటీయాక్సిడెంట్స్ లభిస్తాయి.
రోజు మొత్తంలో మీకు ఎప్పుడు పండ్లు తినాలనిపిస్తే అప్పుడు తినొచ్చు. భోజనానికి, ముందా? తరువాతా? సాయంత్రమా? ఉదయమా? అనేది పట్టించుకోవద్దని చెబుతున్నారు.
కాకాపోతే పండ్లలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు తింటున్నామనేది కూడా ముఖ్యమే. ఈ సూపర్ ఫుడ్స్ తో శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.
రోజులో ఏ సమయంలోనైనా పండ్లు తినొచ్చు. అయితే ముఖ్యంగా భోజనం తరువాత పండ్లు తినకుండా ఉండడమే మంచిది. నిత్యం తాజా పండ్లు తినడం వల్ల బరువు తగ్గడంలో తోడ్పడుతుంది. రెట్టించిన ఉత్సాహంతో పనులు చేసుకోగలుగుతారు.
ఉదయం నిద్ర లేవగానే కాస్త నీళ్లు తాగిన తరువాత పండ్లు తినొచ్చు. ఖాళీ కడుపుతో పండ్లు తినడం శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది.
భోజనానికి ముందు పండ్లు తినడం వల్ల ఆహారంలో తక్కువ క్యాలరీలు తీసుకునేలా తోడ్పడుతుంది.
ఉదయం లేవగానే, అల్పాహారంగా, మద్యాహ్నం భోజనంలోనూ, సాయంత్రం స్నాక్స్ గా తీసుకోవచ్చు. భోజనానికి అరగం ముందు కొన్ని పండ్ల ముక్కలు తినొచ్చు. దీనివల్ల భోజనంలో ఎక్కువగా తినేయడం అనే సమస్యనుండి బయటపడొచ్చు.
ఇక ఫైబర్ ఎక్కువగా ఉన్న పండ్లు తింటే చాలా టైం వరకు కడుపు నిండుగా ఉంటుంది. జీర్ణక్రియ ఆలస్యమవుతుంది. ఆపిల్, పియర్స్, అరటిపండ్లు, రాస్ బెర్రీస్ లలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది.
రాత్రి పడుకునేముందు పండ్లు తినకపోవడమే మంచిది. పండ్లలో ఉండే చక్కెర ఎనర్జీ లెవెల్స్ ను పెంచుతుంది. అందుకే పడుకునే సమయానికి రెండు, మూడు గంటల ముందు పండ్లు తినడం మచింది.
పండ్లు ఆరోగ్యానికి మంచివే.. అయితే సరైన సమయంలో, సరైన పద్దతితో తినడం వల్ల మంచి ప్రయోజనాలు పొందవచ్చు.
పండ్లు ఆరోగ్యానికి మంచివే.. అయితే సరైన సమయంలో, సరైన పద్దతితో తినడం వల్ల మంచి ప్రయోజనాలు పొందవచ్చు.