లడ్డూలంటే మీకు ఇష్టమా? అన్నిరకాల లడ్డూలు ట్రై చేస్తారా? బూందీ లడ్డు, బేసిన్ లడ్డు, రవ్వలడ్డు, మోతీచూర్ లడ్డూ...ఇలా రకరకాల లడ్డూలు ఇష్టపడతారు. అయితే మీలాంటి లడ్డూ ప్రియులకోసమే..స్పెషల్ లడ్డూ.
undefined
మీగడతో చేసే లడ్డూ. మీగడ, రవ్వలతో చేసే స్పెషల్ లడ్డూ. త్వరగా తయారవుతుంది. రుచిగా ఉంటుంది. మలాయ్ తో చేసే ప్రత్యేకమైన లడ్డు ఎలా తయారుచేయాలో చూడండి.
undefined
మలై లడ్డూ తయారీకి కావాల్సిన పదార్థాలు12 కప్పు వేయించిన రవ్వ12 కప్పు కొబ్బరి పొడి14 కప్పు ఎండుద్రాక్ష1 కప్పు తాజా మీగడ12 కప్పు చక్కెర పొడి
undefined
మలై లడ్డూ తయారు చేసే విధానందీనికోసం ముందుగా వేయించిన రవ్వను తీసుకోవాలి. వేయించిన రవ్వ లేకపోతే.. మీడియం మంట మీద బాణలి పెట్టి కాస్త వేడయ్యాక, రవ్వ వేసి బంగారు రంగు వచ్చేలా వేయించుకోవాలి. వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
undefined
రవ్వ చల్లారాక.. ఒక పెద్ద గిన్నెలో వేయించిన రవ్వ, కొబ్బరి పొడి, చక్కెర పొడి, తాజా మీగడ లేదా మలై కలపండి.
undefined
మొత్తం రవ్వలో కలిసేలా పిసికి కలపాలి. సరిపోలేదనుకుంటే ఇంకాస్త మీగడ వేయాలి. ఆ తరువాత దీనికి ఎండుద్రాక్ష వేసి మళ్ళీ బాగా కలపాలి.
undefined
ఇప్పుడు దీన్ని చేత్తో చిన్న చిన్న లడ్డూలుగా చుట్టుకోవాలి. వాటన్నింటిని ట్రేలో పెట్టుకోవాలి.
undefined
ఆ తరువాత 15-20 నిమిషాలు ఫ్రిజ్‌లో పెట్టాలి. అంతే టేస్టీ టేస్టీ మీగడ లడ్డూ రెడీ అయినట్టే..
undefined