ఈ డెజర్ట్... డైట్ లో కూడా తినేయచ్చు..!

First Published | Jun 17, 2021, 11:46 AM IST

డైట్ లో ఉన్నవారు కూడా హాయిగా తినొచ్చట. ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా.. వీటిని తినేయవచ్చని  డైటీషియన్స్ చెబుతున్నారు. మరి ఆ డెజర్ట్స్ ఏంటో మనమూ చేసేద్దామా..
 

డెజర్ట్ ని ఇష్టపడని వారు ఎవరూ ఉండరేమో. కళ్ల ముందు డెజర్ట్ కనపడగానే.. ఎవరికైనా నోరూరుతుంది. తినేయాలనే కోరిక కలుగుతుంది. అయితే.. ఈ డెజర్ట్ లో షుగర్ ఉంటుంది కాబట్టి డైట్ లో ఉన్నవాళ్లు తినడానికి ఇబ్బంది పడుతుంటారు. అయితే.... ఈ డెజర్ట్ లోనూ కొన్నింటిని.. డైట్ లో ఉన్నవారు కూడా హాయిగా తినొచ్చట. ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా.. వీటిని తినేయవచ్చని డైటీషియన్స్ చెబుతున్నారు. మరి ఆ డెజర్ట్స్ ఏంటో మనమూ చేసేద్దామా..
undefined
1.చియా చాక్లెట్ పుడ్డింగ్..ఈ ఆరోగ్యకరమైన ఈ డెజర్ట్ చేయడానికి, మీకు 4 డేట్స్, 2 టేబుల్ స్పూన్లు తియ్యని కోకో పౌడర్, 2 టేబుల్ స్పూన్లు చియా సీడ్స్, 34 కప్పు బాదం పాలు అవసరం.తయారీ..బ్లెండర్ జార్ తీసుకోండి. గింజల్ తీసేసిన డేట్స్, చియా విత్తనాలు, కోకో పౌడర్, బాదం పాలు వేసి మెత్తగా పేస్టులాగా చేయాలి.ఈ మొత్తటి పేస్ట్ ని రెండు గ్లాసెస్ లేదా డెజర్ట్ బౌల్స్ లోకి పోసి 30 నిమిషాలు ఫ్రీజర్ లో పెట్టాలి.అవసరమైతే డ్రై ఫ్రూట్స్ తో అలంకరించండి. అంతే..మీ చియా చాక్లెట్ పుడ్డింగ్ రెడీ..
undefined

Latest Videos


2.ఫ్రూట్ పాప్సికల్హాట్ సమ్మర్ లో అందరూ ఇష్టంగా తినేవాటిలో ఫ్రూట్ పాప్సికల్ ముందుంటాయి. మీకు నచ్చిన ఫ్రూట్లతో వీటిని తయారు చేసుకోవచ్చు. కివీ, వాటర్ మిలన్ తో ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..తయారీ విధానం.. నాలుగు కప్పులు పుచ్చకాయ ముక్కలు, ఒక కప్పు కివీ ముక్కలను తీసుకొని బ్లెండర్ లో వేసి మిక్సీ చేయాలి. దీనిలో రెండు స్పూన్ల తేన కలపాలి. ఆ తర్వాత ఐస్ క్రీమ్ ట్రేలో పోసి.. వాటిని ఫ్రీజ్ చేయాలి. కొన్ని గంటల తర్వాత చూస్తే.. ఫ్రూట్ పాప్సికల్ రెడీ అవుతాయి. చల్లగా తినేయవచ్చు.
undefined
3.బ్లూబెర్రీ యోగర్ట్..బ్లూబెర్రీ యోగర్ట్.. డైట్ లో ఉన్నవారుకూడా తినొచ్చు. ఇతర ఫ్రూట్స్ తో కూడా దీనిని తయారు చేసుకోవచ్చు. ముందుగా బ్లెండర్ లో బ్లూ బెర్రీలను తీసుకొని.. బ్లెండ్ చేయాలి. దీనిలో యోగర్ట్ యాడ్ చేయాలి. దీనిని ఒకసారి బ్లెండ్ చేసి.. దాంట్లో రెండు స్పూన్ల తేన యాడ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కూడా కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టి కూల్ తినేయవచ్చు.
undefined
4.కస్టర్డ్..దీనిని రకరకాల పండ్లతో తయారు చేసుకోవచ్చు. దీనికి కేవలం కస్టర్డ్ పౌడర్, పాలు, పండ్లు ఉంటే సరిపోతుంది.ముందుగా రెండు కప్పుల పాలు తీసుకొని వేడి చేసుకోవాలి. దీనిలో.. కస్టర్డ్ పౌడర్ యాడ్ ఛేయాలి. పాలు మొత్తం చిక్క పడేవరకు ఉంచి.. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత దీనిలో కొద్దిగా తేనె కలపాలి. ఆ తర్వాత మీకు నచ్చిన పండ్లు మొత్తం కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని.. కూల్ గా ఉన్నప్పుడు తినేయవచ్చు.
undefined
click me!