మీరు చక్కెర ప్రియులా? పదే పదే తినాలనిపిస్తుందా?...అయితే ఈ టిప్స్ మీ కోసమే...

First Published | Jun 17, 2021, 1:34 PM IST

కొంతమందికి చక్కెర తినాలనిపిస్తుంది. ఇది అనారోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను సూచిస్తుందని, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. 

భోజనం కాకుండా ఏదో ఓ చిరుతిండి తిన్నాలన్న కోరిక అందరిలోనూ ఉంటుంది. కారంగా తినాలనో, తీయగా తినాలనో, చిప్స్, ఫాస్ట్ ఫుడ్.. ఇలా ఏదో ఒకటి తినాలన్న క్రేవింగ్ ఉంటుంది. అయితే ఇది ఆకలి కాదు. తినాలనిపించడం అంతే.
undefined
అలాగే కొంతమందికి చక్కెర తినాలనిపిస్తుంది. ఇది అనారోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను సూచిస్తుందని, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
undefined

Latest Videos


మరెలా అంటే.. ఆ చక్కెర తినాలనే క్రేవింగ్ నుంచి బయటపడడమే. దీనికోసం ఏం చేయాలో.. చక్కెర ఎక్కువగా తినడం వల్ల జరుగుతుందో తెలుసుకోవాలి.
undefined
చక్కెర ఎక్కువగా తినడం వల్ల తరచుగా ఉబ్బరం, అసిడిటీ, తలనొప్పి, డీహైడ్రేషన్, నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి.
undefined
ఆకలికి, కోరికకు తేడా ఉంటుంది. శరీరానికి కావాల్సిన శక్తిని అందించడానికి తినడం ఆకలి, అయితే కోరిక అనేది ఓ మానసికస్థితి. ఒత్తిడి, ఆందోళన మరేదో ఇలాంటి దానికి సంకేతం. ఉదాహరణకు గుడికి వెళ్లినప్పుడు ప్రసాదం తినడం మామూలు విషయమే.. కానీ ప్రసాదం కోసమే గుడికి వెళ్లడం అనేది మామూలు కాదు. అదే కోరిక. దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. దీనికోసం చేయాల్సిందేంటంటే..
undefined
ఊరగాయ మొరబ్బా : చక్కెర తినాలనే కోరికనుంచి బయటపడడానికి మీ రోజువాలరీ ఆహారంలో ఊరగాయలను చేర్చింది. దీంతోపాటు మొరబ్బా కూడా ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోండి. ఇది సహజ లేదా కృత్రిమ చక్కెరలను అధికంగా తీసుకోకుండా కోరికలను అదుపులో పెట్టడంలో సహాయపడుతుంది.
undefined
రోజూ చక్కెర తినాలనిపించేవారు.. తమ రోజువారీ ఆహారంలో పప్పుధాన్యాలను ఎక్కుగా చేర్చడం మొదలుపెట్టాలి. ఆహారంలో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటే అవి పొట్ట నిండినట్టుగా ఉంచి, క్రేవింగ్ ను తగ్గిస్తాయి.
undefined
మీ డైట్‌లో వారానికి రెండుసార్లు మిల్లెట్లను చేర్చండి. ఇతర ధాన్యాల కన్నా వీటిల్లో గ్లైసెమిక్ తక్కువగా ఉంటాయి. అవి మామూలుగా చక్కెర తినాలన్న కోరికను నియంత్రించడంలో సహాయపడతాయి. జొన్న లేదా మక్కజొన్న రొట్టె తినడం, పరాఠా లేదా అటుకులు తినడం వల్ల ఈ క్రేవింగ్ ను తగ్గించుకోవచ్చు.
undefined
click me!