ఉడకబెట్టిన కోడిగుడ్లతో ఇలా ఎగ్ మంచూరియా చేసుకోండి, స్పైసీగా అదిరిపోతుంది

Published : Aug 20, 2025, 10:34 AM IST

మంచూరియా అనగానే చికెన్ మంచూరియా, వెజ్ మంచూరియా మాత్రమే కాదు.. ఎగ్ మంచూరియా అని కూడా గుర్తు చేసుకోండి. కోడిగుడ్ల తో చేసే మంచూరియా టేస్ట్ అదిరిపోతుంది. 

PREV
15
ఎగ్ మంచూరియా రెసిపీ

కోడిగుడ్లతో చేసే ఆహారాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. పైగా ఎన్నో పోషకాలను అందిస్తాయి. వానాకాలంలో, శీతాకాలంలో... వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడి మంచూరియాను తినేందుకు ఎక్కువమంది ఇష్టపడతారు. ఎప్పుడూ వెజ్ మంచూరియా లేదా చికెన్ మంచూరియానే కాదు... ఒకసారి స్పైసీగా ఎగ్ మంచూరియా చేసుకొని చూడండి. ఇది అద్భుతంగా ఉంటుంది. దీని ఉడకబెట్టిన కోడిగుడ్లతోనే చేస్తాము... కాబట్టి పోషకాలు కూడా నిండు గానే ఉంటాయి. రెసిపీ కూడా చాలా సులువు.. ఎలాగో తెలుసుకోండి.

25
ఎగ్ మంచూరియా రెసిపీకే కావాల్సిన పదార్థాలు

ఉడకబెట్టిన కోడిగుడ్లను మూడు నుంచి నాలుగు సిద్ధం చేసుకోండి. డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె, తగినన్ని నీళ్లు, అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను, కార్న్ ఫ్లోర్ మూడు స్పూన్లు పక్కన పెట్టుకోండి. అలాగే కొత్తిమీర తరుగు రెండు స్పూన్లు, మిరియాల పొడి పావు స్పూను, సోయాసాస్ ఒక స్పూను, ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి రెండు, చిల్లీ సాస్ ఒక స్పూను రెడీగా ఉంచుకోండి. కారం అర స్పూను టమాటో కెచప్, వెనిగర్ అరస్పూను ఒక స్పూను సిద్ధం చేసుకోండి.

35
ఎగ్ మంచూరియా రెసిపీ ఇలా చేయండి

కోడిగుడ్లను ఉడకబెట్టాక పొట్టు తీసి ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు వేసి బాగా కలపండి. కొంచెం నీళ్లను కూడా వేసి చిక్కటి పేస్టులాగా చేసుకోండి. ఇప్పుడు కోడిగుడ్ల ముక్కలను ఇందులో వేసి బాగా కలపండి. ఒక పది నిమిషాలు ఫ్రిజ్లో పెట్టండి. అవి మ్యారినేట్ అవుతాయి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కోడి గుడ్డు ముక్కలను డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయండి. ఆ నూనెలో ఈ కోడి గుడ్డు ముక్కలను వేసి రంగు మారేవరకు వేయించుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి.

45
ఇలా చేయండి

ఇప్పుడు మరొక కళాయి తీసుకుని అందులో రెండు స్పూన్ల నూనె వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో వేసి వేయించండి. అలాగే నిలువుగా తరిగిన ఉల్లిపాయలు, నిలువుగా తరిగిన పచ్చిమిర్చి వేసి వేయించుకోండి. మిరియాల పొడిని కూడా వేసి కలపండి. ఇప్పుడు ఇందులో వెనిగర్, టమాటో కెచప్, చిల్లీ సాస్ కూడా వేసి బాగా కలపండి. ఒక రెండు స్పూన్ల నీటిని వేసి దాన్ని చిక్కటి పేస్ట్ లాగా చేయండి. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కలను వేసి కలపండి. పైన కొత్తిమీర తరుగును చల్లి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే టేస్టీగా మంచూరియా రెడీ అయినట్టే. ఇది అద్భుతంగా ఉంటుంది తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది.

55
స్పైసీగా కావాలంటే

ఇంట్లోని పిల్లలకే కాదు, పెద్దలకు కూడా ఎగ్ మంచూరియా టేస్ట్ నచ్చేస్తుంది. మనం కోడిగుడ్లను ఉడకబెట్టి ఎగ్ మంచూరియా అని చేస్తాము. కాబట్టి అందులోని పోషకాలు బయటకు పోవు.. మంచూరియాలోనే ఉంటాయి. బయట చికెన్ మంచూరియా, వెజ్ మంచూరియా కొనేకన్నా ఇలా ఇంట్లోనే సింపుల్ గా మంచూరియా చేసుకొని చూడండి. శుచిగా మీరే వండుకోవచ్చు. స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిర్చిని, కారాన్ని ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. వేడివేడి ఎగ్ మంచూరియాని వానాకాలంలో తింటే అదిరిపోయేలా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories