పొట్ట తగ్గాలంటే రాత్రిపూట ఈ డ్రింక్స్ ను తాగండి

First Published | Jan 11, 2024, 4:02 PM IST

బరువు తగ్గాలంటే మన ఆహారపు అలవాట్లు బాగుండాలి. అలాగే జీవనశైలి మెరుగ్గా ఉండాలి. అలాగే ప్రతి రోజూ వ్యాయామం చేయాలి. అయితే చాలా మంది బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకునేందుకు వర్కౌట్స్ చేస్తుంటారు. కానీ ఇదొక్కటే సరిపోదని నిపుణులు అంటున్నారు. 

belly fat

అధిక బరువు, ఊబకాయంతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఏదేమైనా బరువు పెరగడం సులువే అయినప్పటికీ.. బరువు తగ్గడం మాత్రం అంత ఈజీ కాదు. ఇందుకోసం ఆరోగ్యకరమైన ఆహారాలను తినాలి. అలాగే మీ జీవనశైలిని మెరుగ్గా ఉంచుకోవాలి. ఇక చాలా మంది బెల్లీ ఫ్యాట్ ను తగ్గించేందుకు ఎన్నో రకాల వ్యాయామాలు చేస్తుంటారు. కానీ బెల్లీ ఫ్యాట్ కరగడానికి కేవలం వ్యాయామాలు మాత్రమే సరిపోవు. నిపుణుల ప్రకారం.. బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకోవడానికి  రాత్రిపూట కొన్ని పానీయాలను తాగాలి. అవేంటంటే? 

అల్లం టీ

అల్లంలో ఎన్నో రకాల ఔషదగుణాలుంటాయి. ఇవి మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంచుతాయి. మీకు తెలుసా? అల్లం టీ కూడా బెల్లీ ఫ్యాట్ ను కరిగించడానికి సహాయపడుతుంది. అల్లంలోని జింజెరోల్ బెల్లీ ఫ్యాట్ ను కరిగించడానికి సహాయపడుతుంది. దీని కోసం మీరు రాత్రి భోజనం తర్వాత అల్లం టీని తాగొచ్చు. 


cumin water

జీలకర్ర వాటర్

జీలకర్రను మనం రోజూ పోపులో వేస్తుంటాం. అయితే ఇది కూడా మీరు బరువు తగ్గడానికి, బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకోవడానికి ఉపయోగపడుతుంది. జీలకర్రలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఫైబర్స్ శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తాయి. బెల్లీ ఫ్యాట్ కరిగేందుకు రాత్రిపూట జీలకర్ర నీటిని తాగాలి. 

గోరువెచ్చని నిమ్మకాయ నీరు

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మరసాన్ని కలిపి తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ వాటర్ లో రుచి కోసం తేనెను కూడా కలపొచ్చు. ఈ వాటర్ కు దీనికి కొద్దిగా చియా సీడ్ ను జోడించి తాగడం వల్ల ఆకలిని తగ్గించి బెల్లీ ఫ్యాట్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. 
 

carrot juice

క్యారెట్ జ్యూస్

క్యారెట్ జ్యూస్ కూడా బెల్లీ ఫ్యాట్ ను కరిగించడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. క్యారెట్ జ్యూస్ బరువు తగ్గడానికి ఎంతో ఎఫెక్టీవ్ గా ఉపయోగపడుతుంది. కాబట్టి రాత్రిపూట క్యారెట్ జ్యూస్ ను తాగొచ్చు. 
 

watermelon juice

పుచ్చకాయ జ్యూస్

పుచ్చకాయ జ్యూస్ లో ఎన్నో పోషకాలు ఉంటాయి.  పుచ్చకాయ చాలా తక్కువ కేలరీలున్న పండు. ఈ పండులో 90 శాతం వాటర్ ఉంటుంది. 100 గ్రాముల పుచ్చకాయలో కేవలం 30 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఎక్కువ హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాబట్టి పుచ్చకాయ జ్యూస్ ను రాత్రిపూట తాగండి.

Latest Videos

click me!