రైతాలో ఉల్లిపాయ కలుపుతున్నారా..? చాలా ప్రమాదం తెలుసా?

First Published | Jul 18, 2023, 2:19 PM IST

రైతాలో ఉల్లిపాయలు వేసుకొని తినడం మాత్రం చాలా ప్రమాదకరం అని నిపుణులు సూచిస్తున్నారు.
 


చాలా మంది రైతా ని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఎక్కువగా బిర్యానీలో కాంబినేషన్ గా తినడానికి ఇష్టపడతారు. అయితే, ఈ రైతా ను తయారు చేసే విధానంలో మనం దానిలో ఉల్లిపాయలను తరిమి వేస్తూ ఉంటాం. కారంగా బిర్యానీ తిన్న తర్వాత రైతా తింటే, కలిగే అనుభూతి హాయిగా ఉంటుంది. అందుకే ఎక్కువగా దీనిని తినడానికి ఇష్టం చూపిస్తూ ఉంటారు.

కొందరు కేవలం ఉల్లిపాయలతో రైతాను చేస్తే, కొందరు కీరీ, క్యారెట్ లాంటి కూరగాయలతో చేస్తూ ఉంటారు. ఎలా తయారు చేసినా రైతాకి సపరేటు ఫ్యాన్ బేస్ ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ,  రైతాలో ఉల్లిపాయలు వేసుకొని తినడం మాత్రం చాలా ప్రమాదకరం అని నిపుణులు సూచిస్తున్నారు.


ఆయుర్వేదం ప్రకారం, దహి , ఉల్లిపాయలను కలిపి తీసుకోకూడదట.  అంటే వ్యతిరేక ప్రభావాలతో కూడిన రెండు ఫుడ్ కాంబినేషన్ ఇవేనట.. దహీ ప్రకృతిలో చల్లగా ఉన్నప్పుడు, ఉల్లిపాయలు వేడిగా పరిగణిస్తారు. అయితే,  ఈ రెండూ కలిసి తీసుకున్నప్పుడు అవి మీ శరీరంలోని దోషాల - వాత, పిత్త, కఫాల అసమతుల్యతను సృష్టిస్తాయి. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది, అత్యంత సాధారణమైనవి అజీర్ణం, ఆమ్లత్వం, ఉబ్బరం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి.

కొంతమంది నిపుణులు ఈ అసమతుల్యత శరీరంలో అధిక వేడిని సృష్టిస్తుంది. టాక్సిన్ స్థాయిలను పెంచుతుంది, ఇది చర్మ అలెర్జీలు,  దద్దుర్లు, తామర , సోరియాసిస్‌తో సహా ప్రతిచర్యలకు దారితీయవచ్చు. కొన్ని సందర్భాల్లో, ప్రతిచర్య కూడా తీవ్రంగా ఉంటుంది, ఇది వాంతులు, ఫుడ్ పాయిజన్ కి కారణం అవుతుంది.

మరి పెరుగుతో కలిసి ఉల్లిపాయను ఎలా తీసుకోవాలి..?
ఉల్లిపాయలలో సల్ఫ్యూరిక్ సమ్మేళనాలు ఉంటాయి, ఈ సమ్మేళనాలు వేడి, ఆక్సీకరణకు సున్నితంగా ఉంటాయి, అంటే ఉల్లిపాయలను వేయించి, ఆపై వాటిని దాహీలో చేర్చడం వల్ల వాటి రియాక్టివ్ శక్తిని తగ్గిస్తుంది.

curd

ఉల్లిపాయలలో సల్ఫర్ స్థాయిని తగ్గించడానికి మీరు చేయాల్సిందల్లా వేయించి, ఆపై వాటిని దాహీలో చేర్చండి, అయితే మితంగా ఉంటుంది. ఎందుకంటే వేడి చేయడం లేదా వేయించడం వల్ల పోషకాలు తొలగించవు. కానీ, వాటి శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి, వాటిని మితంగా జోడించడం వల్ల రైతా రుచిగా  ఉంటుంది.

Latest Videos

click me!