ఒక్క టీ బ్యాగ్ తో ఇన్ని ఉపయోగాలా..?

First Published | Aug 10, 2021, 3:14 PM IST

వాడేసిన టీ బ్యాగులతో అందాన్ని, చర్మ సౌందర్యానికి వాడటం గురించి మీరు వినే ఉంటారు. కానీ.. కిచెన్ లో గిన్నెలను తలతలా మెరవడానికి కూడా ఈ టీ బ్యాగులు ఉపయోగపడతాయి.

టీ అంటే పడి చచ్చిపోయేవాళ్లు మనలో చాలా మందే ఉంటారు. మీకు టీ అంటే ఎందుకు ఇష్టం అంటే.. దాని మీద ప్రేమను ఒక్కమాటలో చెప్పలేం. కానీ.. రోజులో కనీసం ఒక్కసారైనా టీ తాగకుండా ఉండలేరు. ప్రయాణాల్లో ఉన్నా సరే.. ఏదో ఒక విధంగా టీ ని ఆస్వాదించాల్సిందే.
టీ తాగితే ఎక్కడలేని ఉత్సాహం వచ్చినట్లుగా అనిపిస్తుంది. ముందు శరీరంలోని అలసట, నీరసం తగ్గిపోతాయి. మన ఇంట్లో కిచెన్ లో టీ పొడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. అదే.. రిసార్ట్స్, టీ దుకాణాల్లో టీ బ్యాగ్స్ అందుబాటులో ఉంటాయి.

ఇప్పటి వరకు మనకు టీ బ్యాగులతో టీ మాత్రమే చేయవచ్చు అని తెలుసు.. కానీ. .. ఈ టీ బ్యాగులతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మోడ్రన్ ప్రపంచంలో వాటిని వివిధ రకాలుగా వినియోగించవచ్చని చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
ఇంట్లో మొక్కలు పెంచేవారు..అవి బాగా పెరగడానికి ఎరువులు వేస్తూ ఉంటారు. అయితే.. ఇక నుంచి ఆ ఎరువుగా టీ బ్యాగ్ ని వాడితే సరి. టీ బ్యాగులను కుండీల్లో వేస్తే.. అవి త్వరగా డీకంపోజ్ అయ్యి.. మంచి ఎరువుగా మారుతుంది. మొక్క బలంగా పెరగడానికి సహాయం చేస్తుంది.
వాడేసిన టీ బ్యాగులతో అందాన్ని, చర్మ సౌందర్యానికి వాడటం గురించి మీరు వినే ఉంటారు. కానీ.. కిచెన్ లో గిన్నెలను తలతలా మెరవడానికి కూడా ఈ టీ బ్యాగులు ఉపయోగపడతాయి. గిన్నెలు మాడినా.. తప్పు పట్టినా.. వాటిలో టీ బ్యాగ్ చేసి రబ్ చేసి.. ఆ తర్వాత శుభ్రం చేస్తే.. ఆ మచ్చలు పోయి గిన్నెలు మెరుస్తాయి.
చాలా మంది షూ, సాక్సులు ధరించడం వల్ల వారి పాదాలు దుర్వాసనను కలిగిస్తాయి. వాటిని తొలగించడానికి కూడా టీ బ్యాగ్స్ ఉపయోగపడతాయి. బ్లాక్ టీ బ్యాగ్స్ ని నీటిలో వేసి.. ఆనీటిలో 20 నిమిషాల పాటు పాదాలను ఉంచాలి. ఇలా చేయడం వల్ల పాదాల దుర్వాసనను తొలగిస్తుంది.
చాలా మంది సన్ బర్న్స్ తో బాధపడుతుంటారు. ఆ సమస్యను తగ్గించడానికి కూడా ఈ టీ బ్యాగ్స్ ఉపయోగపడతాయి. ఎండ వేడికి కందిన చర్మం దగ్గర ఈ టీ బ్యాగ్ లను 15 నిమిషాలపాటు ఉంచాలి. తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల్ ఉపశమనం లభిస్తుంది.
చాలా మంది బ్రష్ చేస్తుంటే.. చిగుళ్ల నుంచి రక్తం కారుతుంది. లేదంటే చిగుళ్లు వాయడం లాంటివి జరుగుతుంటాయి. అలాంటి వారు.. ఆ ఎఫెక్టెడ్ ప్రాంతంలో.. టీ బ్యాగులను దాదాపు 15 నిమిషాలపాటు ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

Latest Videos

click me!