రాత్రిపూట నిద్రపట్టడం లేదా..? ఇవి తినండి..!

First Published | Jun 12, 2021, 3:32 PM IST

రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపట్టాలంటే పడుకునే ముందు కొన్ని రకాల ఆహారాలు తీసుకోవాలట. వాటిని తీసుకోవడం వల్ల హాయిగా నిద్రపట్టేస్తుందట.
 

రాత్రిపూట నిద్రపట్టడం లేదని బాధపడేవారు ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయారు. అయితే... ఈ సమస్యను చాలా సులభంగా తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం.. ఒత్తిడి తగ్గించుకొని.. కొన్ని రకాల ఆహార పదార్థాలను మన లైఫ్ స్టైల్ లో చేర్చుకుంటే.. ఈ సమస్యను పరిష్కరించవచ్చట.
undefined
రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపట్టాలంటే పడుకునే ముందు కొన్ని రకాల ఆహారాలు తీసుకోవాలట. వాటిని తీసుకోవడం వల్ల హాయిగా నిద్రపట్టేస్తుందట.
undefined

Latest Videos


1. గసగసాల పాలు..రాత్రిపడుకునే ముందు గసగసాలు కలిపిన పాలు తాగితే.. ప్రశాంతంగా నిద్రపడుతుందట. గసగసాలు మెత్తగా నూరి వేడి వేడి పాలలో వేసుకొని రాత్రి పడుకునే ముందు తాగితే.. ఇట్టే నిద్రపట్టేస్తుందట. దీని వల్ల ఆరోగ్యం కూడా లభిస్తుంది. సరిగ్గా నిద్రకు ఉపక్రమించడానికి అరగంట ముందు ఈ పాలు తాగితే చాలు.
undefined
2.చమేలీ టీ..చమేలీ టీకి.. బెడ్ టైమ్ డ్రింక్ గా మంచి పేరు ఉంది. ఇది యాంక్సైటీని తగ్గించి.. ప్రశాంతంగా నిద్రపోవడానికి సహాయం చేస్తుంది. చాలా మంది పడుకునే ముందు టీ, గ్రీన్ టీ లాంటివి తాగుతుంటారు. దానికి బదులు ఈ చమేలీ టీ తాగడం వల్ల ప్రశాంతగా నిద్రపడుతుందట.
undefined
3.సెరల్స్..చాలా మంది సెరల్స్ ని బ్రేక్ ఫాస్ట్ లో తినడానికి ఇష్టడతారు. అయితే.. వీటిని రాత్రపూట తినడం వల్ల హాయిగా నిద్రపడుతుందట. నిద్రలేమితో బాధపడేవారు. నిద్రకు ఉపక్రమించడానికి గంట ముందు వీటిని తింటే సరిపోతుందట.
undefined
బాదం పప్పు..బాదం పప్పులో ఎన్నో విలువైన పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా దీనిలో మెగ్నీషియం పాల్లు ఎక్కువగా ఉంటాయి. బాదం మెలటోనిన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. మెలటోనిన్ మీ శరీర గడియారాన్ని నియంత్రిస్తుంది మీ శరీరాన్ని నిద్ర కోసం సిద్ధం చేయడానికి సంకేతాలు ఇస్తుంది, ఇది మీ నిద్ర చక్రం మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బాదంపప్పులో ట్రిప్టోఫాన్ కూడా ఉంటుంది, ఇది సహజ నిద్ర ప్రేరేపించేది.
undefined
స్వీట్ పొటాటో..వీటిలో.. పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటిలోని న్యూట్రిన్స్.. ప్రశాంతంగా నిద్రపట్టడానికి కారణమౌతాయి. కాబట్టి.. రాత్రి పడుకునే ముందు వీటిని తినడం మంచిది.
undefined
అరటిపండు..అరటి పండులో పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి తినడం వల్ల కూడా శరీరం రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి, యాంగ్సైటీ తగ్గించడంలో ఇవి సహాయం చేస్తాయి. దీనిలోని విటమిన్ బి6.. శరీరంలో మెలాటిన్ లెవల్స్ పెరగడానికి సహాయం చేస్తాయి. దాని వల్ల ప్రశాంతంగా నిద్రపోవడానికి సహాయం చేస్తుంది.
undefined
click me!