మసాలా ఇడ్లీ డంప్లింగ్స్.. చిటికెలో రెడీ.. టేస్ట్ లో సూపర్...

First Published Jun 12, 2021, 4:03 PM IST

ఆరోగ్యకరమైన, తేలికైన టిఫిన్ ఐటమ్ ఇడ్లీ. అయితే రోజూ అదే తినాలంటే బోర్ కొడుతుంది. అందుకే దీనికి మసాలా ట్విస్ట్ ఇచ్చి చూడండి. ఇంక అస్సలు వదిలిపెట్టరు. అంతేకాదు ఈ మసాలా ఇడ్లీ డంప్లింగ్స్ ను స్నాక్స్ గా కూడా తినొచ్చు.

ఆరోగ్యకరమైన, తేలికైన టిఫిన్ ఐటమ్ ఇడ్లీ. అయితే రోజూ అదే తినాలంటే బోర్ కొడుతుంది. అందుకే దీనికి మసాలా ట్విస్ట్ ఇచ్చి చూడండి. ఇంక అస్సలు వదిలిపెట్టరు. అంతేకాదు ఈ మసాలా ఇడ్లీ డంప్లింగ్స్ ను స్నాక్స్ గా కూడా తినొచ్చు.
undefined
ఇడ్లీ పిండిలో తురిమిన కొబ్బరి, జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, క్యారెట్, కరివేపాకు, చాట్ మసాలా కలిపి తయారుచేసిన ఈ స్నాక్ రెసిపీ మిమ్మల్ని ఆకలికి ఆగనివ్వదు.
undefined
ఈ మసాలా ఇడ్లీలను కిట్టి పార్టీలు, పాట్‌లక్స్, గేమ్ నైట్స్, మూవీ నైట్స్ లలో.. టిఫిన్స్, బ్రంచ్ లలో కూడా తినొచ్చు. లంచ్ బాక్స్, పిక్నిక్స్ కు వెళ్లేప్పుడు తీసుకువెళ్లడానికి కూడా బెస్ట్ ఫుడ్ ఇది.
undefined
వీటిల్లో తక్కువ కేలరీలు ఉండడం వల్ల పొట్ట భారీగా అనిపించదు. ఈ సూపర్-లైట్ స్నాక్ ఐటమ్ పరంగానూ, ఆరోగ్యం పరంగానూ.. రెండు రకాలుగా మంచిది. సో ఇప్పుడు ఈ మసాలా ఇడ్లీ డంప్లింగ్స్ ను ఎలా చేస్తారో చూసేయండి మరి..
undefined
మసాలా ఇడ్లీ డంప్లింగ్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..2 కప్పుల ఇడ్లీ పిండి2 టీస్పూన్ల తురిమిన కొబ్బరి1 టీస్పూన్ల జీలకర్ర2 టీస్పూన్ల చాట్ మసాలాతగినంత రిఫైన్డ్ ఆయిల్సగం గుప్పెడు కరివేపాకు2 పచ్చిమిర్చి1 మీడియం క్యారెట్సగం గుప్పెడు కొత్తిమీరరుచికి తగినంత ఉప్పు1 టీస్పూన్ మెంతులు
undefined
మసాలా ఇడ్లీ డంప్లింగ్స్ తయారు చేసే విధానం..ముందుగా పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్‌ను నీటితో బాగా కడిగి.. సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు, ఒక పెద్ద గిన్నెలో, తురిమిన కొబ్బరి, మెంతులతో పాటు, తరిగిన క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి, ఇడ్లీ పిండినికూడా వేసి బాగా కలపండి.
undefined
ఇప్పుడు, మీడియం మంట మీద గుంటపొంగుడాల ప్లేటు పెట్టుకుని ఇది కాస్త వేడెక్కాక.. నూనె రాసి దాంట్లో ముప్పావు వంతు పిండి వేయాలి. తరువా చుట్టూ కాస్త నూనె వేసి మూత పెట్టి, 2-3 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత వీటిని తిప్పేసి మరోవైపు 2-3 నిమిషాలు ఉడికించాలి.
undefined
తరువాత, ఓ కడాయ్ తీసుకుని మీడియం మంట మీద పెట్టి అందులో నూనె వేడి చేయాలి. నూనె తగినంత వేడయ్యాక జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. ఆ తరువాత ఉడికించి పెట్టుకున్న ఇడ్లీలను వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. ఉప్పు మరియు చాట్ మసాలాతో సీజన్ చేసి మరో నిమిషం వేయించాలి.
undefined
తరువాత వీటిని సర్వింగ్ ట్రేలోకి తీసుకుని ఇష్టమైన చట్నీతో సర్వ్ చేయడమే.
undefined
వీటిని మరింత ఈజీగా చేయడానికి వీలుగా ముందు ఇడ్లీలను చిన్న ముక్కలుగా కోసుకోవచ్చు.12 ఉల్లిపాయ, 12 టొమాటో, 12 క్యాప్సికమ్ ను కూడా కోసి, ఇడ్లీతో పాటు వేయించాలి.
undefined
click me!