కొరియన్ ఫ్రైడ్ చికెన్.. యమ్మీ..అండ్ టేస్టీ...

First Published Jun 23, 2021, 4:23 PM IST

మీరు కొరియా సంస్కృతిని ఇష్టపడేవరైతే...అక్కడి అనేక రకాల ఫుడ్ వెరైటీలు కూడా తెలుసుకోవాలి. కొరియన్ ఫ్రైడ్ చికెన్ అత్యంత ప్రాచుర్యం పొందిన కొరియన్ వంటకం. అందుకే చికెన్ ప్లస్ కొరియన్ ప్రియులు ఈ వంటకాన్ని తప్పకుండా ప్రయత్నించాలి. 

మీరు కొరియా సంస్కృతిని ఇష్టపడేవరైతే...అక్కడి అనేక రకాల ఫుడ్ వెరైటీలు కూడా తెలుసుకోవాలి. కొరియన్ ఫ్రైడ్ చికెన్ అత్యంత ప్రాచుర్యం పొందిన కొరియన్ వంటకం. అందుకే చికెన్ ప్లస్ కొరియన్ ప్రియులు ఈ వంటకాన్ని తప్పకుండా ప్రయత్నించాలి.
undefined
చికెన్ ను మొదట బాటర్ లో ముంచి తరువాత డీప్ ఫ్రైడ్ చేయడంతో ఇది సూపర్ క్రిస్పీగా తయారవుతుంది. తేనె, సోయా సాస్, నువ్వుల నూనె, వెల్లుల్లితో సాస్ తయారు చేస్తారు, ఈ సాస్ ను ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలకు పూసి, దానిమీద నువ్వులు అద్దుతారు. ఇది కొరియా సంప్రదాయ రుచికరమైన వంటకం..
undefined
కొరియన్ ఫ్రైడ్ చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు1 పౌండ్ చికెన్ బోన్‌లెస్6 వెల్లుల్లి రెబ్బలు12 కప్పు మైదాపిండి1 టీస్పూన్ చక్కెరరిఫైండ్ ఆయిల్2 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె1 టీస్పూన్ వెల్లుల్లి పొడి4 టేబుల్ స్పూన్ల సోయా సాస్1 మీడియం ఉల్లిపాయఅవసరానికి తగినంత మిరియాలపొడి34 కప్పు కార్న్ ఫ్లోర్అవసరానికి తగినంత నీరురుచికి సరిపడా ఉప్పు2 టీస్పూన్ల నువ్వులు2 టేబుల్ స్పూన్ల తేనె
undefined
కొరియన్ ఫ్రైడ్ చికెన్ తయారు చేసే విధానం..ఒక పెద్ద గిన్నె తీసుకొని.. అందులో బోన్‌లెస్ చికెన్ ముక్కలు వేసి.. దీంట్లోనే ఉల్లిపాయ, వెల్లుల్లి, ఉప్పు, నల్ల మిరియాలు పొడి వేసి బాగా కలపండి. చికెన్‌ను బాగా కలిసేలాగా కలపండి. తరువాత కొన్ని గంటలపాటు నాననివ్వండి.
undefined
మరో గిన్నెలో కార్న్ ఫ్లోర్, మైదా, చక్కెర, 12 టీస్పూన్ నల్ల మిరియాలు, ఉప్పు వేసి కలపండి. ఇవన్నీ పొడిగానే కలపాలి. బాగా కలిశాయి అనుకున్నాక.. అవసరానికి తగ్గట్టుగా నీరు పోసి మెత్తడి బాటర్ తయారయ్యేలా చూసుకోండి. తరువాత ఈ పిండిలో చికెన్ ముక్కలు వేసి బాగా కలపండి.
undefined
ఇప్పుడు ఓ బాణలిలో నూనె వేడిచేసి, చికెన్ ముక్కలను వేయించండి. చికెన్‌ను ముక్కలు బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. వేయించిన ఎక్కువైన నూనెను తీసేయడానికి వాటిని అబ్జార్బెంట్ పేపర్ మీద వేయండి.
undefined
ఇప్పుడు సాస్ తయారు చేయండి... ఓ బాణలిలో 14 కప్పు నీరు, తేనె, సోయా సాస్, వెల్లుల్లి, నువ్వుల నూనె వేసి కలపాలి. దీంట్లో ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి 4-5 నిమిషాలు ఉడికించాలి. తరువాత నువ్వులు చల్లి సర్వ్ చేయడమే.
undefined
click me!