కల్తీ శెనగపిండి.. గుర్తించడమెలా..?

First Published | Jun 22, 2021, 1:14 PM IST

ఒక్కోసారి గోధుమ పిండిలో శెనగ పిండి కలిపి.. దానికి కొద్దిగా అసహజ రంగులు కలిపి అమ్మేస్తున్నారట.

ప్రతి ఒక్కరి కిచెన్ లో.. శెనగపిండి కచ్చితంగా ఉంటుంది. మనలో చాలా మంది శెనగపిండి తో రకరకాల వంటలు చేసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా వర్షాకాలం మొదలైంది. ఈ సమయంలో ఈవెనింగ్ చేసే స్నాక్స్ లో.. ఎక్కువగా ఈ పిండినే వాడుతూ ఉంటాం.
అయితే... మార్కెట్లో లభించే అన్ని శెనగ పిండిలు స్వచ్ఛమైనవి కావాట. వాటిలోనూ కల్తీవి ఉంటాయి. అది తెలుసుకోకుండా.. కల్తీవి తినడం వల్ల మనకు అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మరి స్వచ్ఛత తెలుసుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం..

శెనగపిండిలో దాదాపు 75శాతం సెమోలినా, బియ్యం పిండి, మైజ్ ఫ్లోర్, ఇతర ఆర్టిఫీషియల్ కలర్స్ కలుపుతారు. మరో 25శాతం మాత్రమే స్వచ్ఛమైన శెనగ పిండి ఉంటుంది.
ఒక్కోసారి గోధుమ పిండిలో శెనగ పిండి కలిపి.. దానికి కొద్దిగా అసహజ రంగులు కలిపి అమ్మేస్తున్నారట.
అయితే.... ఆ పిండి స్వచ్ఛమైనదో కాదో.. తెలుసుకోవడానికి ఓ పరీక్ష చేస్తే సరిపోతుందట. దానిలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలిపి.. ఆ పిండి స్వచ్ఛమైనదో కాదో తెలుసుకోవచ్చు.
రెండు స్పూన్ల శెనగపిండి తీసుకొని.. అందులో రెండు స్పూన్ల నీరు కలపాలి. ఆ తర్వాత అందులో రెండు స్పూన్ల హైడ్రో క్లోరిక్ యాసిడ్ కలిపి.. ఐదు నిమిషాలపాటు వదిలేయాలి.
అలా ఐదు నిమిషాల తర్వాత.. ఆ పిండి ఎరుపు రంగులోకి మారితే... అది కల్తీని గుర్తించాలి. కేవలం.. నిమ్మకాయ రసం తో కూడా గుర్తించవచ్చు.
రెండు స్పూన్ల శెనగ పిండిలో.. రెండు స్పూన్ల నిమ్మరసం కలపాలి. ఆ మిశ్రమంలో.. హైడ్రో క్లోరిక్ యాసిడ్ కూడా కలపాలి. తర్వాత కాసేపు దానిని పక్కన వదిలేయాలి. ఆ తర్వాత పిండి ఎరుపు లేదా.. బ్రౌన్ రంగులోకి మారితే.. అది కల్తీ అని గుర్తించాలి. అలా మారకుంటే.. అది స్వచ్ఛమైనదని గుర్తించాలి.
ఇలా కల్తీవి గుర్తించకుంటే.. ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

Latest Videos

click me!