ఉదయాన్నే స్వీట్లను తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | Dec 21, 2023, 7:15 AM IST

స్వీట్లు ఎంత టేస్టీగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే కొంతమంది ఉదయాన్నే పరగడుపున స్వీట్లను తింటుంటారు. కానీ దీనివల్ల మీ శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. 
 

ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాస్ నీళ్లను తాగితే ఆరోగ్యం బాగుటుంది. అలాగే ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను ఖచ్చితంగా తినాలి. అది కూడా హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తినాలి. ఇది మనల్ని రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. అలాగే అలసటను కలిగించదు. మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది కూడా. అందుకే బ్రేక్ ఫాస్ట్ ను ఎట్టి పరిస్థితిలో స్కిప్ చేయకూడదని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు సూచిస్తారు. అయితే కొంది ఉదయం పరిగడుపున స్వీట్లు, కేకులు, బిస్కెట్లను తింటుంటారు. కానీ వీటిని బ్రేక్ ఫాస్ట్ టైం లో తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. 
 

ఉదయాన్నే కేక్ లు, బిస్కెట్లు తినకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అసలు ఉదయాన్నే పరిగడుపున స్వీట్లను తింటే మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 


ఉదయం మీరు స్వీట్లనే ముందు తినడం వల్ల పోషకాలు తీసుకోవడంపై ప్రభావం పడుతుంది. ఎందుకంటే స్వీట్లలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు ఉండవు. అందుకే మీరు తృణధాన్యాలు, పండ్లు, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాల కంటే స్వీట్లను తింటే మీ శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. దీంతో మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే స్వీట్లను కాకుండా పోషకాలుండే ఆహారాలను తినండి. ఇవి మిమ్మల్ని రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచుతాయి. మీ ఆరోగ్యాన్ని పాడుతాయి. 
 

షుగర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని పరిగడుపున తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ త్వరగా పెరుగుతాయి. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ఇన్సులిన్ విడుదల చేయడానికి ప్యాంక్రియాస్ ను ప్రేరేపిస్తుంది. రక్తంలో చక్కెర పెరగడం, ఆ తర్వాత తగ్గడం వల్ల మీకు ఎన్నో సమస్యలు వస్తాయి. చక్కెర తిన్న వెంటనే అలసటగా అనిపిస్తుంది. అలాగే బాగా ఆకలి కూడా వేస్తుంది. 
 

స్వీట్లను అల్పాహారంగా తీసుకోవడం వల్ల గ్లూకోజ్ త్వరగా రక్తప్రవాహంలోకి శోషించబడుతుంది. ఏదేమైనా ఈ శక్తి పెరుగుదల సాధారణంగా స్వల్పకాలికమైనది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం వల్ల మీ శక్తి స్థాయిలు తగ్గుతాయి. ఇది మీకు అలసట, బద్ధకాన్ని కలిగిస్తుంది.
 

sweets

చక్కెర ఆహారాలను ఉదయాన్నే తినడం వల్ల రోజంతా మరిన్ని తీపి ఆహారాలను తినాలన్న కోరిక కలుగుతుంది. ఎందుకంటే ఇది అనుబంధ న్యూరోట్రాన్స్మిటర్ డోపామైన్ విడుదలను ప్రేరేపిస్తుంది. మీ శరీరం చక్కెరపై ఆధారపడటాన్ని ఎక్కువ చేస్తుంది. ఇది పెరిగిన ఆకలి, సమతుల్య ఆహారాన్ని నిర్వహించడంలో ఇబ్బందికి దారితీస్తుంది.

చక్కెర ఎక్కువగా ఉండే చాలా ఆహారాల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉండవు. మీ అల్పాహారంలో చక్కెర పదార్ధాలే ఎక్కువగా ఉంటే మీ శరీరం సరైన విధంగా పనిచేయదు. అలాగే సరైన పనితీరుకు అవసరమైన ముఖ్యమైన పోషకాలను కోల్పోవచ్చు.

చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను క్రమం తప్పకుండా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. అలాగే ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, దంత సమస్యలతో సహా ఎన్నో ఆరోగ్య సమస్యల ముప్పు పెరుగుతుంది. 

Latest Videos

click me!