బిర్యానీ ఒక్కటే కాదు, హైదరాబాద్ లో మిస్ కాకూడని ఫుడ్స్ ఇవి..!

First Published | Dec 20, 2023, 2:12 PM IST

ఈ హైదరాబాదీ కిచిడీ ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించడమే కాదు, టేస్ట్ కూడా అదిరిపోతుంది. మీరు రుచి చూశారా?
 

హైదరాబాద్ అనగానే ఎవరికైనా ముందు గుర్తుకు వచ్చేది బిర్యానీనే. హైదరాబాద్ నగరంలో ఉండే జనాలే కాదు.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు సైతం బిర్యానీ రుచిచూడాలి అనుకుంటారు. హైదరాబాద్ లో మనకు చాలా రకాల బిర్యానీ వెరైటీలు ఉన్నాయి.  ఆ సంగతి పక్కన పెడితే, బిర్యానీ మాత్రమే కాకుండా.. హైదరాబాద్ లో కచ్చితంగా రుచి  చూడాల్సిన ఫుడ్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో ఓసారి చూసేద్దాం...

biryani

1.హైదరాబాదీ బిర్యానీ..
ఎప్పుడూ చెప్పినట్లే హైదరాబాద్ బెస్ట్ ఫుడ్స్ లో ముందుగా వినిపించేది బిర్యానీనే.  హైదరాబాద్ బిర్యానీలో మసాలాలు, బాస్మతీ రైస్ , చికెన్  అన్నీ కలిపి తయారు చేస్తారు. దమ్ బిర్యానీ కి అయితే తిరుగేలేదు. మీలో ఎంత మంది బిర్యానీ లవర్స్ ఉన్నారు.

Latest Videos


2.హైదరాబాదీ కిచిడీ..
బిర్యానీ తర్వాత మరో ఫేమస్ ఫుడ్ హైదరాబాద్ లో టేస్ట్ చూడాల్సింది కిచిడీ. ఈ హైదరాబాదీ కిచిడీ ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించడమే కాదు, టేస్ట్ కూడా అదిరిపోతుంది. మీరు రుచి చూశారా?

3.లుక్మీ..
ఇది కూడా హైదరాబాద్ లో లభించే బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు. త్రిభుజాకారంలో ఉంటాయి. చూడటానికి సమోసాలాగా కనిపిస్తాయి. డీప్ ఫ్రైడ్ స్నాక్ ఇది. రుచి మాత్రం అదిరిపోతుంది.
 

4.మార్గ్..
లోకల్ ఫంక్షన్స్ లో దీనిని ఎక్కువగా దీనిని సర్వ్ చేస్తూ ఉంటారు. మటన్ సూప్ అని కూడా చెప్పొచ్చు.  ఈ చలికాలంలో దీనీని టేస్ట్ వస్తే మజా మరింత బాగుంటుంది.
 

Irani Chai

5.ఇరానీ ఛాయ్..

హైదరాబాద్ లో ఉన్నవారే కాదు, అప్పుడప్పుడు వచ్చేవారు సైతం కచ్చితంగా రుచి చూడాల్సిన దాంట్లో ఇరానీ చాయ్ మొదటి ప్లేస్ లో ఉంటుంది. బిర్యానీ ఎంత ఫేమసో హైదరాబాద్ కి, ఇరానీ చాయ్ కూడా అంతే ఫేమస్ అని చెప్పొచ్చు. ఉదయాన్నే లేవగానే ఈ ఇరానీ చాయ్ తాగితే వచ్చే అనుభూతి అద్భుతం అని చెప్పొచ్చు.

6.మలాయ్ కుర్మా..
క్రీమ్, మసాలాలు, కూరగాయలు, ఎగ్ లేదంటే,మీట్ వేసి ఈ మలాయ్ కుర్మా తయారు చేస్తారు. ఒక్కసారైనా దీనిని అందరూ రుచి చూడాల్సిందే.
 

7.కుబానీకా మీటా..
ఇప్పటి వరకు అన్నీ స్పైసీ ఫుడ్స్ చూశాం కదా.. ఇది డెలీషియస్ స్వీట్ అని చెప్పొచ్చు. బిర్యానీ లేదా, ఏదైనా స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు ఈ కుర్బానీ కా మీటా రుచి చూడాలి. సూపర్ స్వీట్ ఇది.
 

Haleem

8.హైదరాబాదీ హలీమ్..
రంజాన్ మాసంలో హైదరాబాద్ లో ఏ సందులో చూసినా దొరికే ఫుడ్ హలీమ్. ఈ హలీమ్ ని కేవలం ముస్లిం సోదరులే కాదు.. అందరూ  అమితంగా ఆస్వాదిస్తారు.
 


9.బోటీ కబాబ్..
హైదరాబాద్ లో చాలా మంది మటన్ ప్రియులు ఉంటారు. అలాంటివారు ఈ బోటీ కబాబ్ ని కూడా అంతే ఎక్కువగా ఇష్టపడతారు. ఇప్పటి వరకు రుచి చూడకపోతే, ఒకసారి ప్రయత్నించండి.

click me!