క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రాబోతున్నాయి. వీటికి చాలా మంది కేక్ లను కట్ చేస్తుంటారు. వీటికే కాదు పండుగలు, ఫంక్షన్లు, బర్త్ డే, ఇతర పార్టీలకు కూడా కేక్ కట్టింగ్ ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఎప్పుడూ బయట నుంచే అంటే అంతగా ఏం బావుంటుంది. అందులోనూ ఎంతో డబ్బు ఖర్చు కూడా పెట్టాల్సి వస్తుంది. అయినా బయట ఎలా తయారుచేస్తున్నారో కూడా తెలియదు. అందుకే చిన్న చిన్న పార్టీలకు కేక్ లను ఇంట్లోనే తయారుచేసుకోవడం మంచిది. ఇది మీకు ఎక్స్ పీరియన్స్ ను కూడా కలిగిస్తుంది. అయితే మనలో చాలా మంది కేక్ లను తయారుచేయడం పెద్ద ప్రాసెస్ అని.. దీనికి ఎన్నో పదార్థాలు అవసరమవుతాయని అనుకుంటారు. కానీ కొన్ని రకాల కేక్ లను చాలా ఈజీగా తయారుచేయొచ్చు. కేవలం పది ఇరవై నిమిషాల్లోనే తయారుచేసేయొచ్చు.