పండ్లలో రారాజు మామిడిపండు. అమృతంలాంటి రుచితో ఆకట్టుకునే మామిడిపండును ఇష్టపడనివారు చాలా అరుదు. అందుకే మామిడి పండ్ల సీజన్ వచ్చిందంటే అందరికీ పండగే.
కోతమామిడికాయలతో మొదలుపెట్టి.. మామిడిరసాల వరకు అనేకరకాల పండ్లు, విభిన్న రుచులతో ఆకట్టుకుంటాయి. అంతేకాదు జ్యూసీ మామిడిపండ్లు.. తియతీయ్యని, మెత్తని రుచితో..ఆకట్టుకునే ఈ పండ్లతో అనేక రకాల కొత్తవంటకాలనూ ట్రైచేయచ్చు.
మ్యాంగో మిల్క్‌షేక్, మ్యాంగో కేకులు, ఐస్ క్రీమ్‌లు, స్మూతీస్ ఇలా అనేక రుచుల్లో మామిడిపండును ఆస్వాదించొచ్చు.
చెఫ్ కునాల్ కపూర్ చెప్పిన మామిడి పండు రెసిపీ మ్యాంగో మలై. 5 నిమిషాల్లో తయారయ్యే రుచికరమైన, అద్భుతమైన రెసిపీ ఇది.
మ్యాంగో మలై రెసిపీ కి మలాయ్ లేదా ఫ్రెష్ క్రీమ్, మామిడిపండ్లు రెండు పదార్థాలే అవసరం.
పండిన మామిడిపండును మధ్యలో కోసి.. టెంకను కత్తితో వేరుచేయాలి.
ఆ తరువాత రెండు అర్థ భాగాలుగా వచ్చిన మామిడిపండులో ఫ్రెష్ మలాయ్ ని నింపాలి.. అంతే మ్యాంగో మలాయ్ రెడీ..
దీన్ని స్పూన్ తో తింటుంటే.. మలాయ్.. మామిడిపండు కలిసి అద్బుతమైన రుచిగామారిపోతాయి.
దీన్ని స్పూన్ తో తింటుంటే.. మలాయ్.. మామిడిపండు కలిసి అద్బుతమైన రుచిగామారిపోతాయి.