బీరకాయ తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | May 11, 2024, 2:23 PM IST

మనం ప్రతి రోజూ కూరలు చేసుకుని తింటుంటాం. నిజానికి కూరగాయలు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బీరకాయను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే?
 

బీరకాయలను ఎండాకాలంలో బాగా పండిస్తుంటారు. దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ కూరగాయను తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ ఇది మన ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే దీన్ని తినకుండా అస్సలు ఉండలేరు. అసలు బీరకాయను తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

బీరకాయలోని పోషకాలు 

బీరకాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. అలాగే వీటిలో కాపర్, కాల్షియం, పొటాషియం, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, విటమిన్-ఎ, విటమిన్ బి, విటమిన్ సి మొదలైన ఎన్నో ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇన్ని పోషకాలున్న బీరకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 
 


గట్ ఆరోగ్యం

బీరకాయలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. అలాగే ఈ కూరగాయలో వాటర్ పరిమాణం కూడా ఎక్కువగానే ఉంటుంది. దీన్ని తినడం వల్ల గట్ ఆరోగ్యంగా ఉంటుంది. 

బరువు తగ్గుతారు

బీరకాయలో కేలరీల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే దీనిలో నీటితో పాటుగా ఎక్కువ మొత్తంలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. దీన్ని తింటే బరువు తగ్గడం సులువు అవుతుంది. బరువు తగ్గాలనుకున్న వారికి బీరకాయ మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. 
 

రక్తంలో చక్కెర

బీరకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఎక్కువ మొత్తంలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. బీరకాయను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అంటే బీరకాయ డయాబెటీస్ పేషెంట్లకు మంచి మేలు చేస్తుంది. 
 

ridge gourd

గుండె ఆరోగ్యం

బీరకాయను తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. దీనిని తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బీరకాయను తింటే గుండె జబ్బులొచ్చే రిస్క్ చాలా వరకు తగ్గుతుంది. 

మలబద్ధకం నుంచి ఉపశమనం 

బీరకాయలో కూరలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల మలబద్దకం నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే బీరకాయలో విటమిన్-ఎ మెండుగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల కంటి ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతుంది. దీన్ని తినడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. 

Latest Videos

click me!