రెడ్ రైస్ ను ఎందుకు తినాలో తెలుసా?

First Published Feb 28, 2024, 2:29 PM IST

చాలా మంది వైట్ రైస్ నే మూడు పూటలా తింటుంటారు. కానీ వైట్ రైస్ లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన బరువును పెంచడంతో పాటుగా.. ఎన్నో సమస్యలను కూడా పెంచుతాయి. అందుకే వైట్ రైస్ కంటే రెడ్ రైస్ ఆరోగ్యానికి మంచిదని చెప్తుంటారు నిపుణులు. అసలు రెడ్ రైస్ మన హెల్త్ కు ఎలాంటి మేలు చేస్తుందంటే? 
 

చాలా మందికి రెడ్ రైస్ గురించి తెలియదు. కానీ ఇది మనం తినే వైట్ రైస్ కంటె ఎక్కువ మేలు చేస్తుంది. అయితే గ్రామాల్లో బ్లాక్ రైస్ అని కూడా పిలువబడే ఈ ఎర్రని బియ్యాన్ని కూడా తింటున్నారు. ఈ రైస్ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను నయం చేయడానికి ఎంతో సహాయపడుతుంది. ఈ రెడ్ రైస్ లో ఉండే ఎన్నో ఔషదగుణాలు ఎన్నో రోగాలు రాకుండా మనల్ని కాపాడుతాయి. 
 

ఈ రెడ్ రైస్ తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు చెందిన సాంప్రదాయ బియ్యం. సాధారణంగా మన ఇండ్లలో ఉపయోగించే వైట్ రైస్ కంటే రెడ్ రైస్ లోనే మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వాళ్లు ఈ బియ్యాన్ని తినొచ్చు. ఈ రైస్ మీ శరీరానికి అవసరమైన పోషణను అందిస్తుంది. అలాగే మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అసలు రెడ్ రైస్ ను తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

Latest Videos


క్యాన్సర్ ను నివారిస్తుంది

రెడ్ రైస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ ను నాశనం చేస్తాయి. ఈ ఫ్రీ రాడికల్స్ మన శరీరంలోని కణాలకు సోకి క్యాన్సర్, అల్జీమర్స్, గుండె జబ్బులను కలిగిస్తాయి. రెడ్ రైస్ లో రోగాలతో పోరాడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. 
 

కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది

వైట్ రైస్ కు బదులుగా రెడ్ రైస్ ను తింటే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని నిరూపించబడింది. ఆరు నెలల పాటు ఎర్ర బియ్యం తిన్న వారిని తెల్ల బియ్యంతో పోల్చిన ఒక అధ్యయనంలో.. రెడ్ రైస్ ను తిన్న వారిలో చెడు కొలెస్ట్రాల్ తక్కువగా ఉందని తేలింది. రెడ్ రైస్ మీ కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా చూస్తుంది. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి  సహాయపడుతుంది.

రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది

రెడ్ రైస్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అందుకే ఇది డయాబెటీస్ పేషెంట్లకు మంచి మేలు చేస్తుంది. దీన్ని తింటే రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి. అలాగే రెడ్ రైస్ లో ఫైబర్ కూడా  పుష్కలంగా ఉంటుంది, ఇది చాలా సులువుగా జీర్ణమవుతుంది. 
 

బరువును తగ్గిస్తుంది

రెడ్ రైస్ లో కేలరీలు తక్కువగా, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇది బరువు తగ్గాలనుకునేవారికి బాగా ఉపయోగపడుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు మీ కడుపును తొందరగా నింపి మీరు అతిగా తినకుండా చేస్తాయి. అలాగే మీ ఆకలిని నియంత్రిస్తాయి. రెడ్ రైస్ లో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతాయి. 
 

Red Rice

ఇమ్యూనిటీ

రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండేందుక అవసరమైన విటమిన్లు, ఖనిజాలు రెడ్ రైస్ లో మెండుగా ఉంటాయి. ఎర్ర బియ్యంలో ఐరన్, విటమిన్ బి 6, విటమిన్ ఇ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడతాయి. విటమిన్ బి 6, విటమిన్ ఇ లు రక్త కణాలను దెబ్బతినకుండా రక్షిస్తాయి. 

గుండె ఆరోగ్యం

ఎర్ర బియ్యానికి కొలెస్ట్రాల్ ను తగ్గించే లక్షణాలు ఉంటాయి. అందుకే దీన్ని గుండెకు మేలు చేసే ఫుడ్ గా చెప్తారు. చెడు కొలెస్ట్రాల్ యే గుండె జబ్బులకు ప్రధాన కారణం. రెడ్ రైస్ లో ఉండే మెగ్నీషియం గుండె రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. గుండెపోటు రాకుండా రక్షిస్తుంది.

click me!