చికెన్ ను స్కిన్ తో తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | Jul 2, 2024, 1:46 PM IST

చికెన్ అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. దీన్ని వారానికి రెండు మూడు సార్లు తినే వారు కూడా ఉన్నారు. కానీ చికెన్ లో ఒక భాగాన్ని పొరపాటున కూడా తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదేంటంటే? 
 

చాలా మంది మటన్ కంటే చికెన్ నే ఎక్కువగా ఇష్టపడతారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ చికెన్ ను ఎక్కువగా తింటుంటారు. ముఖ్యంగా మాంసాహారులకు చికెన్ అంటే పిచ్చి. మటన్, చికెన్ లో వీళ్లు చికెన్ నే ముందు సెలక్ట్ చేసుకుంటారు. నిజానికి చికెన్ మంచి పోషకాహారం. దీనిలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో ప్రోటీన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తింటే మన శరీరం బలంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

chicken


నిజానికి చికెన్, మేక మాంసం కంటే తక్కువ ధర ఉంటుంది. అందుకే దీన్ని ఎక్కువగా తింటుంటారు. బరువు తగ్గాలనుకునేవారు కూడా చికెన్ ను ఎక్కువగా తింటుంటారు. అయితే చికెన్ లోని కొన్ని భాగాలు మన ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అసలు చికెన్ లో ఏ భాగం మంచిది? ఏ భాగం మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


చికెన్ లో ఏ భాగాన్ని తినకూడదు?

చికెన్ స్కిన్ ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఎందుకంటే ఇది టేస్టీగా ఉంటుంది. కానీ దీన్ని అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.చికెన్ స్కిన్ లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు చికెన్ స్కిన్ ను ఫ్రెష్ గా ఉంచేందుకు కెమికల్స్ దానిపై ఉపయోగిస్తారని నిపుణులు చెబుతున్నారు. గుండెజబ్బు సమస్యలతో బాధపడేవారు చికెన్న స్కిన్ ను పొరపాటున కూడా తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 

అలాగే ఫారంలో పెంచే కోళ్లను తినే అలవాటును కూడా వదిలేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మీరు ఫామ్ చికెన్ ను తినాలనుకుంటే స్కిన్ లెస్ చికెన్ ను మాత్రమే తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 


చికెన్ స్కిన్ లో కొవ్వులు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అలాగే దీనిలో కేలరీలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందుకే అధిక రక్తపోటు ఉన్నవారు పొరపాటున కూడా చికెన్ స్కిన్ ను తినకూడదు. అయితే చికెన్ స్కిన్ లో ఒమేగా 3,6 కొవ్వు ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అందుకే మీరు చికెన్ స్కిన్ ను తరచుగా కాకుండా ఒక 15 రోజులకోసారి తక్కువగా తినాలి. 
 

చికెన్ లో ఏ భాగం తినొచ్చు?

చికెన్ బ్రెస్ట్ పార్ట్ ను ఎంచక్కా తినొచ్చు. ఈ పార్ట్ లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. ముఖ్యంగా ఇది బరువు తగ్గడానికి, కండరాల పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. 

చికెన్ తొడ ప్రాంతం కూడా తినొచ్చు. ఈ భాగంలో  కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అలాగే చికెన్ వింగ్స్ లో కూడా కొవ్వు, కేలరీలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అందుకే వీటిని కాల్చడానికి బదులుగా ఉడకబెట్టిన పులుసుతో తింటే మంచిది. చికెన్ తినాలనుకుంటే బ్రాయిలర్ కోళ్లు, ఫామ్ కోళ్లకు బదులుగా నాటు కోళ్లను తింటే ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. 

Latest Videos

click me!