రాత్రి మిగిలిన అన్నంతో ఎలాంటి వంటకాలను చేయొచ్చో తెలుసా?

First Published Jun 29, 2024, 2:42 PM IST

చాలా సార్లు రాత్రిపూట వండిన అన్నం మిగులుతుంది. ఈ మిగిలిపోయిన చల్లగా ఉంటుంది కాబట్ట ఎవరికీ తినాలనిపించదు. కానీ ఈ మిగిలిపోయిన అన్నంతో మీరు రకరకాల టేస్టీ టేస్టీ వంటకాలను తయారుచేయొచ్చు. 
 

రాత్రి పూట మిగిలిపోయిన అన్నాన్ని మరుసటి రోజు ఎవరూ తినరని డస్ట్ బిన్ లో వేసేస్తుంటారు చాలా మంది. కానీ ఈ మిగిలిపోయిన అన్నంతో కూడా మీరు రకరకాల వంటకాయలను చేసి తినొచ్చు. అవును వీటిని చేయడం కూడా చాలా ఈజీ. మరి మిగిలిపోయిన అన్నంతో ఏమేమి చేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం పదండి 
 

lemon rice


లెమన్ రైస్

లెమన్ రైస్ ను తయారుచేయడానికి ముందుగా ఒక బాణలిలో నూనె వేడిచేసి ఆవాలు, కరివేపాకు వేసి వేయించండి. ఇప్పుడు దీంట్లో రెండు టీస్పూన్ల శెనగపప్పును వేసి వేయించండి. అలాగే తర్వాత పచ్చిమిర్చి వేసి కలపండి. ఆ తర్వాత మిగిలిన అన్నాన్ని దీంటో వేయండి. ఇప్పుడు అన్నం మీద ఉప్పు, నిమ్మరసం, పచ్చి కొత్తిమీర వేసి అన్నీ బాగా కలపండి. ఇది బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ చేయండి. 
 



గుంత పునుగులు

గుంత పునుగులను తయారుచేయడం చాలా ఈజీ. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇందుకోసం మీరు మిగిలిపోయిన అన్నాన్ని, పెరుగును గ్రైండర్ లో బాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిలో ఉప్పు, మిరియాలపొడి, గరంమసాలా వేసి బాగా కలపండి. వీటిని తయారుచేసే పాన్ ను స్టవ్ పై పెట్టండి. వీటిలో కొంచెం నూనె వేసి నూనెలో ఆవాలు, జీలకర్ర వేయండి. తర్వాత సిద్ధం చేసిన బియ్యం పిండిలో పచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కలపండి. ఇప్పుడు అప్పే మౌల్డ్ లో పిండి వేసి మూతపెట్టి రెండు వైపుల నుంచి బంగారు రంగులోకి మారే వరకు ఉడికించండి. అంతే వేడి వేడి గుంతపునుగులు రెడీ.
 


ఫ్రైడ్ రైస్

చాలా మంది ఫ్రైడ్ రైస్ ను తినాలన్న ఇష్టం ఉంటుంది. ఇందుకోసం హోటల్స్ కు వెళుతుంటారు. కానీ మీరు ఇంట్లో మిగిలిన అన్నంతో కూడా హోటల్ స్టైల్ లో ఫ్రైడ్ రైస్ ను తయారుచేయొచ్చు. ఇందుకోసం బాణలిలో నూనె వేడి చేయండి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, క్యారెట్లు, బీన్స్, క్యాబేజీ వేసి కాసేపు వేయించండి. తర్వాత పాన్ లో మిగిలిన అన్నాన్ని వేసి కలపండి. ఇప్పుడు అన్నంలో రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి బాగా కలపాలి. కావాలనుకుంటే ఫ్రైడ్ రైస్ లో సోయా సాస్, చిల్లీ సాస్, నల్ల మిరియాలు కూడా కలుపుకోవచ్చు.
 

జీలకర్ర రైస్

మిగిలిపోయిన అన్నంతో మీరు జీలకర్ర రైస్ ను కూడా తయారుచేయొచ్చు. ఇందుకోసం బాణలిలో నెయ్యి వేసి వేడి చేయండి. ఇప్పుడు దీంట్లో అర టీస్పూన్ జీలకర్ర వేసి వేయించండి. ఆ తర్వాత నూనెలో ఎండు లేదా పచ్చిమిర్చి వేసి బాగా కలిపి సర్వ్ చేయండి అంతే.
 

click me!