చాయ్, బిస్కెట్ తినగానే చాలా మంది తమకు ఎనర్జీ వచ్చినట్లు ఫీలౌతారు. కానీ... ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల నీరసం లాంటివి వస్తాయి. ఈ రెండింటిలోనూ ఎలాంటి న్యూట్రియంట్స్ ఉండవు. ఇవి తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.
ఈ రెండింటి కాంబినేషన్ దంతాలకు కూడా మంచిదేమీకాదు. పంటి నొప్పి రావడం.. దంతాలు పాడవ్వడం లాంటి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు.. బిస్కెట్లో ఉప్ప క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల.. బ్లడ్ ప్రెజర్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే బీపీ ఉన్నవారు.. పొరపాటున కూడా ఈ రెండూ తినకపోవడమే మంచిది.