రోజూ ఒక చిన్న బెల్లం ముక్కను తింటే ఏమవుతుందో తెలుసా?

First Published | Aug 6, 2024, 10:01 AM IST

చక్కెర కంటే బెల్లమే మేలు. ఇది చక్కెర లాగ మన ఆరోగ్యాన్ని పాడు చేయదు. నిజానికి బెల్లంలో మన ఆరోగ్యానికి సహాయపడే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. అందుకే దీన్ని రోజూ కొంచెం తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు.

jaggery

బెల్లం మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనిలో మాంసకృత్తులు, క్యాల్షియం, విటమిన్ -బి12, ఐరన్ తో పాటుగా ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో వ్యాధుల నుంచి రక్షిస్తాయి. అందుకే టీ లో చక్కెరకు బదులుగా బెల్లాన్ని వేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. రోజూ ఒక చిన్న బెల్లం ముక్కను తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

jaggery

రోగనిరోధక వ్యవస్థ బలోపేతం

మన ఇమ్యూనిటీ పవర్ ఎంత ఎక్కువగా ఉంటే.. మనం వ్యాధులకు అంత దూరం ఉంటాం. ఒక వేళ మన రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే దగ్గు, జలుబు నుంచి ఎన్నో వ్యాధులు మనకు తరచుగా వస్తుంటాయి. ఇది ముందే వర్షకాలం ఈ సీజన్ లో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు రోజూ ఒక చిన్న బెల్లం ముక్కను తిన్నారంటే మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దీంతో దగ్గు, జలుబు, జ్వరాలకు దూరంగా ఉంటారు. 

Latest Videos


jaggery 5p

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది 

అవును బెల్లం మన జీర్ణక్రియను మెరుగుపర్చడానికి కూడా సహాయపడుతుంది. రోజూ ఒక చిన్న బెల్లం ముక్కను తింటే జీర్ణ ఎంజైములు శరీరంలో బాగా రిలీజ్ అవుతాయి. ఇవి మన జీర్ణక్రియను మెరుగుపరచడానికి బాగా సహాయపడతాయి. ఇది అజీర్ణం, మలబద్ధకం, అపానవాయువు వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. 
 

గొంతు నొప్పి నుంచి ఉపశమనం 

వానాకాలంలో గొంతునొప్పి సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే మీరో రోజూ ఒక చిన్న బెల్లం ముక్కను తింటే గనుక ఈ గొంతునొప్పి సమస్య నుంచి చాలా తొందరగా ఉపశమనం లభిస్తుంది. గొంతులో ఎక్కువ అసౌకర్యం ఉంటే అల్లాన్ని బెల్లం, నెయ్యితో వేయించి తింటే సరిపోతుంది. 
 

jaggery


ఇనుము కొరత ఉండదు 

ఆడవారికి ఐరన్ లోపం ఎక్కువగా ఉంటుంది. అయితే ఐరన్ లోపం పోవడానికి బెల్లం బాగా సహాయపడుతుంది. మీరు గనుక రోజూ ఒక చిన్న బెల్లం ముక్కను తిన్నట్టైతే మీ శరీరంలో ఐరన్ లోపం ఉండదు. నిజానికి బెల్లంలో ఇనుము పుష్కలంగా ఉంటుంది. దీనిని తింటే మీ శరీరంలో హిమోగ్లోబిన్ సరిగ్గా ఉంటుంది.
 


శరీరం నిర్విషీకరణ

రోజూ ఒక చిన్న బెల్లం ముక్కను తింటే మీ శరీరంలోని మురికి అంతా బయటకు పోతుందది. అందుకే రాత్రి పడుకునే ముందు ఒక చిన్న బెల్లం ముక్కను తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 

గుండెకు మేలు 

ముందే ప్రస్తుత కాలంలో గుండె జబ్బుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. మీ గుండెను మీరు ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే మాత్రం రోజూ కొద్దిగా బెల్లం ముక్కను తినండి. అవును బెల్లం ముక్క మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దీనిలో ఉండే పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. 
 

ఎముకలు బలోపేతం 

బెల్లంలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఎముకలను బలంగా ఉంచడానికి బాగా సహాయపడతాయి. మీరు రోజూ ఒక చిన్న బెల్లం ముక్కను తింటే ఎముకల వ్యాధి కి దూరంగా ఉంటారు. 

click me!