ఇది మామూలు ఆకు కాదు.. 300 రోగాలను తగ్గించే దివ్య ఔషదం.. ఇది మనకు తెలిసిందే..

First Published | Jul 26, 2024, 11:11 AM IST

మన చుట్టూ ఉన్న ఎన్నో మొక్కలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ ఈ విషయం మనకు తెలియదు. కానీ వీటితో తయారుచేసిన మందులను మాత్రం వాడుతున్నాం. ఇలాగే మన చూట్టూ, మన పెరట్లో, మన పొలాల్లో పెరిగే ఓ మొక్క ఆకులు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అవేంటంటే? 

మనుగాకు తెలియని వారు ఎవరూ ఉండరు. ఓ మునగాకు దీని కూర బాగుంటుంది. ఈ చెట్టు మునగకాయలు కూడా సూపర్ టేస్టీగా ఉంటాయంటారు. కానీ ఈ చెట్టు ఆకులు మనకు చేసే మేలు గురించి మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. అవును ఈ చెట్టు ఆకులు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ ఆకులతో మనం ఎన్నో రోగాలను తగ్గించుకోవచ్చు. అందుకే వేరేదేశాల వారు ఈ చెట్టును మిరాకిల్ ట్రీ అంటారు. దీనితో ఎన్నో ఔషదాలను తయారుచేసి అమ్ముతున్నారు కూడా. వీటిని వాడుతూ మనం ఎన్నో రోగాలను తగ్గించుకుంటున్నాం. ఎవరో తయారుచేసిన మందులకు బదులుగా ఈ ఆకులనే తీసుకుంటే మన ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు కదా.. అసలు మునగాకులు మనకు ఎలాంటి మేలు చేస్తాయో తెలుసుకుందాం పదండి. 

మునగాకులో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ డిప్రెసెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకులు మన ఆరోగ్యానికి దివ్య ఔషదంలా పనిచేస్తాయి.  మునగ చెట్టు ఆకులే కాకుండా.. దీనికాయలు, బెరడు అన్నీ.. మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. 


శక్తి స్థాయిలు..

మునగాకును తీసుకుంటే మన శరీరంలో శక్తి స్థాయిలు బాగా పెరుగుతాయి. దీంతో అలసట, బలహీనత వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మునగాకులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇదే మన బలహీనతను, మగతను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది.
 

రోగనిరోధక శక్తి ..

రోగనిరోధక శక్తిని పెంచడానికి నిమ్మకాయ, నారింజ వంటి పండ్లే సహాయపడతాయని చాలా మంది అనుకుంటుంటారు. కానీ సిట్రస్ పండ్లలో కంటే ఎక్కువ విటమిన్ సి మునగాకులో ఉంటుంది తెలుసా.  మునగాకులను తీసుకుంటే మన రోగనిరోధక  శక్తి బాగా పెరుగుతుంది. దీనిలో ఇమ్యూనిటీని పెంచే ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అంటువ్యాధులతో పోరాడే శక్తిని మన శరీరానికి అందిస్తాయి. ఇవి విటమిన్ ఎ, విటమిన్ సి, ఇనుమును కలిగి ఉంటాయి. ఇవి మన ఇమ్యూనిటీ పవర్ ను బలంగా చేస్తాయి. 
 

రక్తంలో చక్కెర స్థాయిలు 

మునగాకులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా బాగా సహాయపడుతుంది. ఇది డయాబెటీస్ ను కంట్రోల్ చేయడమే కాకుండా.. డయాబెటీస్ వచ్చే ప్రమాదాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. మునగాకులో క్లోరోజెనిక్ ఆమ్లం అని పిలువబడే వర్ణద్రవ్యం కూడా మెండుగా ఉంటుంది. ఇది తిన్న తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా కాపాడుతుంది. 
 

మంటను తగ్గిస్తుంది.. 

చాలా మంది శరీర మంటతో బాధపడుతుంటారు. ఇది మరీ ప్రమాదకరమైనదేం కాదు. కానీ మునగాకు దీనిని తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. మునగాకు ఒక శక్తివంతమైన శోథ నిరోధక ఏజెంట్ గా పనిచేస్తుంది. అలాగే తాపజనక ఎంజైమ్లను అణచివేస్తుంది. అలాగే శోథ నిరోధక సైటోకిన్ల ఉత్పత్తిని పెంచి శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడుతుంది.
 

గుండె ఆరోగ్యం.. 

మునగాకు మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా బాగా సహాయపడుతుంది. ఇది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. అలాగే ఇది హృదయనాళ వ్యవస్థకు మద్దతు ఇస్తాయి. దీంతో మనకు గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. 
 

కడుపునకు మంచిది

మునగాకులు మన జీర్ణవ్యవస్థకు కూడా బాగా సహాయపడతాయి. ఈ ఆకులను తింటే కడుపు ఉబ్బరం, మలబద్ధకం, గ్యాస్, గ్యాస్ట్రైటిస్, వ్రణోత్పత్తి పెద్దప్రేగు శోథ వంటి సమస్యలు తొందరగా తగ్గిపోతాయి. 
 

ఎముకల ఆరోగ్యం 

మునగాకుల్లో భాస్వరం, కాల్షియం లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. మునగాకులు శోథ నిరోధక స్వభావాన్ని కలిగి ఉంటాయి.  ఇవి కీళ్ల నొప్పులను, కాళ్ల నొప్పులను తగ్గిస్తాయి. అలాగే బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. ఇవి మీ ఎముకలను బలంగా ఉంచుతాయి.

Latest Videos

click me!