పరగడుపున అల్లం టీ తాగితే ఏమౌతుంది? అసలు ఈ టీ ఎలా తాగాలో తెలుసా?

First Published | Sep 24, 2024, 4:46 PM IST

 రోజూ పరగడుపున అల్లం టీ తాగొచ్చా..? తాగితే ఏమౌతుంది..? మన ఆరోగ్యం సేఫేనా..? అసలు.. అల్లం టీ ఎలా తాగాలో మీకు తెలుసా? ఈ విషయాలు ఇప్పుడు నిపుణుల సహాయంతో మనం తెలుసుకుందాం...
 

Image: Freepik

ఇండియన్స్ దాదాపు అందరూ ఉదయం లేవగానే తమ రోజుని టీతో ప్రారంభిస్తారు. కొందరైతే టీ తాగిన తర్వాతే ఏదైనా పనులు చేయడం మొదలుపెడతారు. రోజూ ఒకే టైమ్ కి టీ పడాల్సిందే. టీ టైమ్ కి పడకపోతే... తలనొప్పి రావడం, కోపం, చిరాకు కూడా వచ్చేస్తూ ఉంటాయి. అయితే.. టీని అందరూ ఒకేలా తాగరు. ఆ టీలో పాలు, టీ పొడి మాత్రమే కాదు.. చాలా ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చు. కొందరు యాలకులు వేసుకుంటారు.. మరి కొందరు అల్లం వేసుకుంటారు. అన్నింట్లోకి అల్లం టీ ఆరోగ్యానికి మంచిదని ఎక్కువ మంది నమ్ముతారు.
 

దానికోసమే... ఎక్కువ మంది అల్లం టీ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ.. రోజూ పరగడుపున అల్లం టీ తాగొచ్చా..? తాగితే ఏమౌతుంది..? మన ఆరోగ్యం సేఫేనా..? అసలు.. అల్లం టీ ఎలా తాగాలో మీకు తెలుసా? ఈ విషయాలు ఇప్పుడు నిపుణుల సహాయంతో మనం తెలుసుకుందాం.....

అల్లం టీ ఎందుకు మంచిది అని భావిస్తాం అంటే... దానిలో ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీలతో పాటు.. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీలు కూడా ఉన్నాయి. ఇవన్నీ.. మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ లెక్కన అల్లం రోజూ తీసుకున్నా, పరగడుపున తీసుకున్నా మనకు మంచిదే. కానీ.. పాలు, పంచదార, టీ పొడి కలిపి చేసే టీ లా మాత్రం తీసుకోకూడదట.ఖాళీ కడుపుతో అల్లం టీ మీకు ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. కానీ, మీరు పాలు , టీ ఆకులను కలిపి తయారు చేయకూడదు. ఈ రకం టీ మాత్రం ఏమాత్రం ఆరోగ్యకరం కాదు. దీని వల్ల ఉపయోగాలు లేకపోగా.. నష్టాలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది.
 


ginger tea

మరి అల్లం టీ ఎలా తీసుకోవాలి..?

మీరు అల్లం నీటిలో ఉడకబెట్టండి. దీన్ని ఫిల్టర్ చేసి, గది ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాత, తేనె లేదా నిమ్మరసం జోడించండి.
ఈ టీ గుణాలతో నిండి ఉంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అల్లంలో విటమిన్ సి, కాల్షియం, ఐరన్, కాపర్ , జింక్ పుష్కలంగా ఉన్నాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అల్లం హెర్బల్ టీ జీవక్రియను పెంచుతుంది. దాని వినియోగం బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచే అల్లంటీ..
పాలతో కాకుండా.. పైన చెప్పిన విధంగా అల్లం టీ చేసుకొని తాగితే మనకు చాలా ప్రయోజనాలు లభిస్తాయి.  అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వ్యాధులను దూరం చేస్తుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి చర్మాన్ని ఆరోగ్యవంతంగా మార్చడంలో సహాయపడతాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం టీ తాగడం వల్ల ముఖంలో మెరుపు వస్తుంది. మొటిమలు తొలగిపోతాయి.

ఇలా అల్లం టీ తాగితే నష్టాలే..
ఖాళీ కడుపుతో ఇలా అల్లం టీ తాగడం వల్ల మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ, ఎక్కువ మోతాదులో తాగకూడదు.
ఇది కాకుండా, ఉదయం పూట పాలు , టీ ఆకులతో అల్లం టీ ఆరోగ్యానికి హానికరం. ఇది గ్యాస్ , అసిడిటీకి కారణమవుతుంది.
మీరు ఉదయం ఖాళీ కడుపుతో అల్లం టీ తాగితే, దానికి ముందు 1-2 గ్లాసుల నీరు త్రాగాలి. దీంతో జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఇక రోజులో కూడా ఒకటి లేదంటే రెండు కప్పులకు మించి అల్లం టీ తాగకపోవడమే మంచిది.

Latest Videos

click me!