ప్లేట్ భోజనం ఎలా తీసుకుంటే.. బరువు తగ్గుతారో తెలుసా?

First Published | Sep 24, 2024, 3:53 PM IST

ప్రతిరోజూ మన ప్లేట్ భోజనం ఎలా ఉండేలా చూసుకుంటే ఈజీగా బరువు తగ్గడం సాధ్యమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం...

బరువు తగ్గాలని ప్రయత్నించేవారు చాలా మంది ఉంటారు. దానికోసం ఎక్కువ మంది చేసే మొదటి పని.. ఫుడ్ తినడం మానేయం.  తిండి తినడం మానేస్తే ఈజీగా బరువు తగ్గుతాం కదా అనుకుంటారు. కానీ... అలా తింటే బరువు తగ్గుతారు కానీ.. చాలా ఆరోగ్య సమస్యలు వచ్చేస్తాయి. అందుకే.. బరువు తగ్గడం అనేది హెల్దీగా జరగాలి.

అలా హెల్దీగా జరగాలి అంటే..మనం తీసుకునే ఆహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే షుగర్, ఉప్పు, అనారోగ్యకరమైన ఫ్యాట్స్ లాంటి వాటిని అస్సలు తినకూడదు. ముఖ్యంగా ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని మితంగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.  అయితే.. అనారోగ్య ఆహారాలు తినకూడదు.. ఆరోగ్యకరమైన ఆహారాలు తినాలి అని అందరూ చెబుతారు. కానీ... ప్రతిరోజూ మన ప్లేట్ భోజనం ఎలా ఉండేలా చూసుకుంటే ఈజీగా బరువు తగ్గడం సాధ్యమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం...

Weight loss

మన ప్లేట్ చాలా బ్యాలెన్స్డ్ గా ఉండేలా చూసుకోవాలి. అంటే.. మన ప్రతి భోజనంలో అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి. కార్బో హైడ్రేట్స్, ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ అన్నీ ఆ భోజనంలో మనకు అందేలా చూసుకోవాలి. దానికోసం మీ భోజనం ప్లేట్ ని నాలుగు భాగాలుగా విభజించుకోవాలి. నాలుగు భాగాల్లో శరీరానికి కావాల్సివన్నీ ఉండేలా చూసుకుంటే.. మనం ఎలాంటి కష్టం పడకుండానే ఈజీగా బరువు తగ్గొచ్చు. ఆ ప్లేట్ లోని నాలుగు భాగాల్లో ఏమేమీ ఉండాలో చూద్దాం..


1.సలాడ్..
మీ భోజనాన్ని ఎప్పుడైనా సలాడ్ తో మొదలుపెట్టాలి. మీ ప్లేట్ లోని నాలుగు భాగాల్లో ఒక భాగాన్ని సలాడ్ తో నింపాలి. అంటే పచ్చికూరగాయలు ఉండాలి.
ఇది మీకు మంచి బ్లడ్ షుగర్ కలిగి ఉండటానికి సహాయపడుతుంది.

2.ప్రోటీన్..
ఇక భోజనంలో రెండో భాగం కచ్చితంగా ప్రోటీన్ కూడా ఉండాలి. ప్రోటీన్ అంటే మీరు చికెన్, కోడి గుడ్డు, పప్పు, పన్నీర్ లాంటివి ఎంచుకోవాలి. ప్రోటీన్ బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది.

3. రైతా లేదా పెరుగు మూడవ ఖాళీని ప్రోబయోటిక్స్ లేదా ప్రీబయోటిక్స్ మూలంతో నింపాలి. మీరు గ్రీక్ పెరుగు, రైతా లేదా సాదా పెరుగుతో తినవచ్చు. ఇది మీ జీర్ణశక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

4. కార్బోహైడ్రేట్ల కోసం రోటీ చివరగా, కార్బోహైడ్రేట్ల మూలంతో చివరి స్థలాన్ని పూరించండి. అన్నం లేదంటే.. రోటీ తినొచ్చు. మల్టీ గ్రెయిన్ రోటీ అయితే మరీ మంచిది.  మీరు మీ భోజనాన్ని ఇలా తింటే, మీ కార్బోహైడ్రేట్లపై మీకు ఇంకా నియంత్రణ ఉంటుంది. మీరు దానిని అతిగా తినకూడదు.

రోజూ మీ ప్లేట్ భోజనాన్ని కనుక ఇలా.. నాలుగు భాగాలుగా తీసుకుంటే... కచ్చితంగా బరువు తగ్గుతారు. ఇలా భోజనం తీసుకుంటూ... రెగ్యులర్ గా వ్యాయామం చేస్తే.. కచ్చితంగా చాలా ఈజీగా బరువు తగ్గుతారు.

Latest Videos

click me!