ప్రతి ఒక్కరూ తమకు మందమైన, మెరిసే జుట్టు కావాలని కోరుకుంటారు. కానీ.. ఈ రోజుల్లో సరైన ఆహారం తినకపోవడం, ఇతర సమస్యల కారణంగా జుట్టు విపరీతంగా రాలిపోవడం, పల్చబడటం చాలా కామన్ అయిపోయింది. ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి, కాలుష్యం, పోషకాహార లోపం కూడా జుట్టు రాలడానికి కారణం అవుతుంది. అయితే.. ఈ సమస్యను కేవలం రోజూ పాలకూర తినడం వల్ల తగ్గించవచ్చని మీకు తెలుసా?మీరు చదివింది నిజం. మరి, రోజూ పాలకూర తినడం వల్ల మనకు, మన జుట్టుకు కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం…